దేశంలో కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి ఎక్కువగా వైరస్ విజృంభించింది మరియు పాజిటివ్ కేసులు వచ్చిన రాష్ట్రం మహారాష్ట్ర అని అందరికీ తెలుసు.దేశంలో అన్ని రాష్ట్రాలలో వైరస్ అదుపులోకి వచ్చినా గానీ మహారాష్ట్రలో మాత్రం పరిస్థితి ముందు నుండి ఇబ్బందికరంగానే అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి.
అదుపు చేయటం సవాలుగా మారింది.మొన్నటి వారికి అదుపులోకి వచ్చినట్టు పరిస్థితి మారినా గాని సెకండ్ వేవ్ ఆల్రెడీ స్టార్ట్ అయినట్లు కొత్త కేసులు ఊహించని విధంగా పెరగటంతో కేంద్రం ఇప్పటికే ప్రత్యేక బృందాలను మహారాష్ట్రకు పంపటం తెలిసిందే.
దీంతో మహారాష్ట్రలో ఉన్న జనాలు టెన్షన్ లో ఉన్నారు.ఇలాంటి తరుణంలో మరో వ్యాధి మహారాష్ట్రలో ప్రబలుతున్నట్లు సరికొత్త వార్తలు వస్తున్నాయి.పూర్తి మేటర్ లోకి వెళ్తే కరోనా తో పాటు మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూకేసులు పెరుగుతున్నాయి అట.బర్డ్ ఫ్లూ కారణంగా ఇప్పటికే 45 కోళ్లు చనిపోయాయట.దీంతో వెంటనే ప్రభుత్వం అప్రమత్తమయ్యాయి మరణించిన కోళ్ల యొక్క శాంపిల్స్.నిర్ధారణ పరీక్షలకు ల్యాబ్ కి పంపించగా.బర్డ్ ఫ్లూ అని నిర్ధారణ అయిందట.దీంతో పాల్గర్ జిల్లాలో ఈ ఘటన జరగటంతో 21 రోజుల పాటు జిల్లాలో చికెన్ దుకాణాలు అదేవిధంగా పౌల్ట్రీ ఫారాలు ఓపెన్ చేయకూడదని మహారాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
ఒక పక్క మహమ్మారి వైరస్ మరోపక్క బర్డ్ ఫ్లూ వార్తలు ఇప్పుడు మహారాష్ట్ర ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
![Telugu Bird Flu, Corona Poitive, Corona, Maharashtra, Palgar-Latest News - Telug Telugu Bird Flu, Corona Poitive, Corona, Maharashtra, Palgar-Latest News - Telug]( https://telugustop.com/wp-content/uploads/2021/02/another-disease-bird-flu-in-maharashtra-along-with-the-corona-virus.jpg)