ఇటీవల రోజుల్లో మధుమేహం తో( Diabetes ) బాధపడుతున్న వారి సంఖ్య ఎంత భారీగా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇంటికి కనీసం ఒక్కరైనా షుగర్ పేషెంట్ ఉంటున్నారు.
మధుమేహం వచ్చాక షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవడానికి చాలా కష్టపడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.
అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ పొడి మీకు చాలా బాగా సహాయపడుతుంది.నిత్యం ఈ పొడిని తీసుకుంటే షుగర్ కంట్రోల్ అవ్వడమే కాకుండా అదిరిపోయే హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.
![Telugu Sugar Levels, Fennel Seeds, Flax Seeds, Tips, Healthy Powder, Latest, Pum Telugu Sugar Levels, Fennel Seeds, Flax Seeds, Tips, Healthy Powder, Latest, Pum](https://telugustop.com/wp-content/uploads/2024/09/Consuming-this-powder-has-amazing-health-benefits-including-sugar-control-detailsa.jpg)
పొడి తయారీ కోసం.ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక కప్పు గుమ్మడి గింజలు( Pumpkin Seeds ) వేసి వేయించుకోవాలి.ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు అవిసె గింజలు( Flax Seeds ) మరియు ఒక కప్పు సోంపు గింజలు వేసి వేయించుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో రోస్ట్ చేసి పెట్టుకున్న అవిసె గింజలు, సోంపు మరియు గుమ్మడి గింజలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.
![Telugu Sugar Levels, Fennel Seeds, Flax Seeds, Tips, Healthy Powder, Latest, Pum Telugu Sugar Levels, Fennel Seeds, Flax Seeds, Tips, Healthy Powder, Latest, Pum](https://telugustop.com/wp-content/uploads/2024/09/Consuming-this-powder-has-amazing-health-benefits-including-sugar-control-detailssd.jpg)
రోజు ఉదయం తయారు చేసుకున్న పొడిని ఒక స్పూన్ చొప్పున తీసుకుని ఆపై ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్ సేవించాలి.నిత్యం ఏ విధంగా కనుక చేసే రక్తంలో చక్కెర స్థాయిలు( Blood Sugar Levels ) నియంత్రణలో ఉంటాయి.మధుమేహం వ్యాధి మీ కంట్రోల్ లో ఉంటుంది.
అలాగే ఈ పొడిని తీసుకోవడం వల్ల ఎముకలు బలోపేతం అవుతాయి.కీళ్ల నొప్పులు దూరం అవుతాయి.
జీర్ణ క్రియ చురుగ్గా మారుతుంది.మలబద్ధకం సమస్య ఉంటే పరారవుతుంది.అలాగే ఈ పొడి మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యకు చెక్ పెడుతుంది.మెదడును చురుగ్గా మారుస్తుంది.
గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.కాబట్టి మధుమేహం ఉన్న వారే కాదు ఎవరైనా సరే ఈ పొడిని తమ డైట్ లో చేర్చుకోవచ్చు.
ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.