సాధారణంగా కొందరికి ముఖ చర్మంపై ముదురు రంగు మచ్చలు ఏర్పడుతుంటాయి.ఇవి చాలా అసహ్యంగా కనిపిస్తాయి.
అందాన్ని పాడు చేస్తాయి.స్కిన్ టోన్ ను( Skin Tone ) అన్ ఈవెన్ గా మారుస్తాయి.
దాంతో తెగ హైరానా పడిపోతూ ఉంటారు.మచ్చలతో నిండిన చర్మాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలో అర్థం కాక అయోమయంలో పడిపోతుంటారు.
కానీ వర్రీ అక్కర్లేదు.ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ క్రీమ్ ను రెగ్యులర్ గా వాడితే ఎంతటి మొండి మచ్చలు అయినా పరార్ అవుతాయి.
అదే సమయంలో స్కిన్ టోన్ ఈవెన్ గా సైతం మారుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
![Telugu Aloevera Gel, Tips, Skin Tone, Face Cream, Skin, Latest, Natural Cream, R Telugu Aloevera Gel, Tips, Skin Tone, Face Cream, Skin, Latest, Natural Cream, R](https://telugustop.com/wp-content/uploads/2024/09/Try-this-natural-cream-for-spotless-and-even-skin-tone-detailsd.jpg)
ముందుగా రెండు నిమ్మ పండ్లను( Lemons ) తీసుకుని సగానికి కట్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloevera Gel ) వేసుకోవాలి.అలాగే మూడు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, వన్ టేబుల్ స్పూన్ వెజిటేబుల్ గ్లిజరిన్, పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.
![Telugu Aloevera Gel, Tips, Skin Tone, Face Cream, Skin, Latest, Natural Cream, R Telugu Aloevera Gel, Tips, Skin Tone, Face Cream, Skin, Latest, Natural Cream, R](https://telugustop.com/wp-content/uploads/2024/09/Try-this-natural-cream-for-spotless-and-even-skin-tone-detailss.jpg)
రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలిపితే మన క్రీమ్( Cream ) అనేది రెడీ అవుతుంది.ఒక బాక్స్ లో తయారు చేసుకున్న క్రీమ్ ను నింపుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు.రోజు నైట్ నిద్రించే ముందు తయారు చేసుకున్న క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుని పడుకోవాలి.
రెగ్యులర్ గా ఈ న్యాచురల్ క్రీమ్ ను కనుక వాడితే ముఖ చర్మం పై మొండి మచ్చలు తగ్గుముఖం పడతాయి.స్కిన్ టోన్ ఈవెన్ గా మరియు గ్లోయింగ్ గా మారుతుంది.
డ్రై స్కిన్ సమస్య దూరం అవుతుంది.చర్మం మృదువుగా తయారవుతుంది.
కాబట్టి మచ్చలేని మెరిసే చర్మాన్ని కోరుకునే వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న క్రీమ్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.