తెలుగులో ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన “అన్నమయ్య” చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన ప్రముఖ తమిళ నటి “కస్తూరి శంకర్” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అయితే కస్తూరి శంకర్ తెలుగులో నటించింది తక్కువ చిత్రాలే అయినప్పటికీ తనకంటూ సినిమా పరిశ్రమలో కొంత మంది అభిమానులను సంపాదించుకుంది.అయితే ఈ మధ్య కాలంలో నటి కస్తూరి శంకర్ పలు రకాల యూట్యూబ్ వీడియోలు మరియు ధారావాహికలలో నటిస్తూ బాగానే రాణిస్తోంది.
కాగా కస్తూరి శంకర్ కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.అయితే ఇంతకీ ఆ ఫోటోలు ఏమిటంటే గతంలో నటి కస్తూరి శంకర్ స్విమ్మింగ్ పూల్ లో స్నానపు దుస్తులను ధరించి తన కొడుకుతో దిగినటువంటి ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
అంతేకాక ఈత పాఠాలను తన యొక్క ప్రైవేటు ట్యూషన్ టీచర్ తో నేర్చుకుంటున్నాననంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.అయితే ఈ ఫోటోలను షేర్ చేసింది గతంలోనే అయినప్పటికీ ఈ మధ్య కొందరు కస్తూరి ఫోటోలను తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
దీంతో తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.అంతేకాక ఈ ఫోటోలలో కస్తూరి శంకర్ కొంతమేర ప్రైవేట్ శరీరభాగాలు కనిపిస్తుండడంతో కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతేగాక పెళ్లయి పిల్లలున్నటువంటి మహిళలు ఇలాంటి ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేయడం వల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వెంటనే ఈ ఫోటోలను తొలగించాలని కస్తూరి శంకర్ కి సూచిస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కస్తూరి శంకర్ తెలుగులో పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తూనే ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ స్టార్ మా ఛానెల్ లో ప్రసారమువుతున్న “ఇంటింటి గృహలక్ష్మి” అనే ధారావాహికలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తోంది.
అలాగే తమిళ భాషలో తెరకెక్కుతున్న “తమిళరసన్” అనే చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.కాగా ఈ చిత్రంలో హీరోగా విజయ్ అంథోని నటిస్తున్నాడు.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు సమాచారం.