తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ కొందరు మాత్రం చేసింది తక్కువ సినిమాలే అయిన వాళ్ళ ఐడెంటిటీ అనేది ఎక్కువ కాలం కనిపిస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళలో ముందు వరుసలో ఉంటారు సాయి కుమార్.సాయి కుమార్ వాళ్ళ నాన్న కూడా నటుడే ఆయనే పి.
జె.శర్మ.పి.జె.శర్మ తెలుగులో చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఆయనకు పెద్దగా గుర్తింపు రాలేదనే చెప్పాలి.ఆయన భార్య అయిన కృష్ణ జ్యోతి కూడా కన్నడలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును సాధించారు.
అప్పట్లో పి జె శర్మ మంచి అందగాడు అయినప్పటికీ తనకి మంచి అవకాశాలు అయితే రాలేదనే చెప్పాలి.
ఎందుకంటే తన నటన ప్రతిభను బయటికి చూపిద్దాం అంటే అలాంటి క్యారెక్టర్ ఒకటి కూడా తనకి రాకపోవడం అనేది ఒక విధంగా తెలుగు ప్రేక్షకులు చేసుకున్న దురదృష్టం అని చెప్పాలి నటన పరంగా ఆయనకు ఆయనే సాటి అని చాలాసార్లు ఆయన చేసిన పాత్రల ద్వారా మనకు చెప్పకనే చెప్పారు.
ఆయనకు నటుడిగా అవకాశాలు రాకపోవడంతో జీవితాన్ని గడపడానికి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన గాత్రాన్ని దానం చేసి మంచి గుర్తింపును సాధించారు.ఆయన వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన సాయి కుమార్ కూడా మొదట్లో దూరదర్శన్ లో వచ్చిన సీరియల్స్ లో నటించి, ఆ తర్వాత సినిమాల్లో నటించినప్పటికీ తనకి పెద్దగా గుర్తింపు రాలేదనే చెప్పాలి.
ఆ తర్వాత కన్నడ లో వచ్చిన పోలీస్ స్టోరీ సినిమాలో హీరోగా మంచి గుర్తింపు సాధించాడు ఆ సినిమా తెలుగులో డబ్ అయి మంచి విజయాన్ని సాధించింది.దాంతో సాయి కుమార్ హీరోగా తెలుగులో మంచి అవకాశాలను అందుకున్నప్పటికీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏవి పెద్దగా ఆడకపోయెసరికి తన మార్కెట్ అనేది రోజురోజుకి పడిపోయింది.
అయితే సాయికుమార్ మొదట్లో హీరో రాజశేఖర్, సుమన్ లకు డబ్బింగ్ చెప్పాడు.ఒక విధంగా వాళ్లకి స్టార్లుగా గుర్తింపు రావడానికి సాయికుమార్ వాయిస్ కూడా చాలా ప్లస్ అయింది అని చెప్పాలి.అలాగే ముత్తు, భాష లాంటి సినిమాల్లో రజినీకాంత్కి కూడా తెలుగులో సాయికుమార్ డబ్బింగ్ చెప్పాడు, అలాగే అమితాబ్ బచ్చన్ కి కూడా డబ్బింగ్ చెప్పాడు.కానీ సాయికుమార్ మాత్రం పెద్ద హీరోగా ఎదిగలేకపోయాడు దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు.
సామాన్యుడు, ఎవడు, ప్రస్థానం, పటాస్ లాంటి సినిమాల్లో తనదైన నటన ప్రతిభను చూపిస్తూ అవార్డులను కూడా గెలుచుకున్నాడు.ముఖ్యంగా ప్రస్థానం సినిమాలో తను చెప్పిన డైలాగులు గాని తను పోషించిన పాత్ర గాని ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోతుంది, అలాంటి పాత్రని సాయి కుమార్ తప్ప వేరే వాళ్ళు చేయలేరు అనేంతగా తన నటనతో జనాలని మెస్మరైజ్ చేశారు.
సాయికుమార్ మొత్తానికి తను అనుకున్న స్థాయిని అయితే అందుకోలేదనే చెప్పాలి.
తను అనుకున్న స్థాయికి చేరుకోకపోవడానికి ఒక వంతు గా తన కులం కూడా తనకి కారణం అని చెబుతుంటాడు సాయికుమార్ ఏం కులం వాడో తెలియకుండా జాగ్రత్త పడదాం అని సాయి కుమార్ శర్మగా ఉన్న పేరులో శర్మని తొలగించి సాయికుమార్ మాత్రమే ఉంచుకున్నాడు.అయినప్పటికీ వాళ్ల నాన్న పేరు పి జె శర్మ గా ఉండడం వల్ల, వాళ్ల కులం ఏంటో అందరికీ తెలిసిపోతుంది,అని చెబుతూ తను ఎదగక పోవడానికి తన కులం కూడా ఖచ్చితంగా ఒక కారణమే అని ఇప్పటికీ చెబుతుంటాడు.ఇలా చెబుతూనే అయిన భగవంతుడు ఏది ఇవ్వాలి అనుకుంటే అది ఇస్తాడు అని మళ్ళీ చెప్పుకొస్తాడు.
సాయి కుమార్ పరిస్థితి ఇలా ఉంటే ప్రేమ కావాలి సినిమా తో తన కొడుకు అయిన ఆదిని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.మొదటి సినిమా మంచి విజయం సాధించినప్పటికీ తర్వాత పెద్దగా సక్సెస్ లు అందుకోలేకపోతున్నాడు.
ప్రస్తుతం రెండు, మూడు సినిమాలతో వస్తున్న ఆది వాటితో అయిన విజయాన్ని అందుకుంటాడో, లేదో చూద్దాం…
.