యూట్యూబ్‌లో దుమ్ములేపుతోన్న మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుటోంది.ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తయిన ఈ చిత్ర షూటింగ్, తాజాగా సాంగ్స్ షూట్ జరుపుకుంటోంది.

 Sarileru Neekevvaru Suryudivoo Chandrudivoo Song Creating Record-TeluguStop.com

కాగా తాజాగా ఈ సినిమాలో నుండి ‘సూర్యుడివో చంద్రుడివో’ అనే పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.ఈ పాట యూట్యూబ్‌లో రచ్చ చేస్తోంది.

రామజోగయ్య శాస్త్రి అందించిన చక్కటి లిరిక్స్‌కు దేవిశ్రీ ప్రసాద్ మెలోడితో కూడిన బాణీలు అందించాడు.బి ప్రాక్ పాడిన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నడుస్తోంది.

విజయశాంతి కుటుంబానికి అండగా నిలిచే మహేష్ బాబు పాత్రను పొగుడుతూ ఈ పాట సాగుతోంది.యూట్యూబ్‌లో ఈ పాట రికార్డు వ్యూస్ సాధిస్తోంది.ఈ పాట రిలీజ్ అయిన 24 గంటల లోపే రెండున్నర మిలియన్ వ్యూస్ సాధించింది.

ఈ పాటతో యూట్యూబ్ పాత రికార్డులను మహేష్ బద్దలు కొట్టడం ఖాయమని తెలుస్తోంది.

పూర్తి ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన నటిస్తోండగా లేడీ అమితాబ్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తోంది.అనిల్ సుంకర ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube