శరీరంలో రాగి లోపం ఉన్నట్టయితే ఇలాంటి సమస్యలే వస్తాయి?

మానవ శరీరం సప్తధాతువుల నిర్మాణం.అంటే రసము, రక్తము, మాంసము, మేధస్సు, మజ్జ, అస్థి, శుక్రము.

 If There Is A Lack Of Copper In The Body, Will These Problems Occur, Health Care-TeluguStop.com

ఇవన్నీ సక్రమంగా పనిచేసినప్పుడే మానవుని మనుగడ సాధ్యమౌతుంది.లేదంటే శరీరం పడిపోతుంది.

అందుకే ఈ శరీరం సరైన రీతిలో పనిచేయాలంటే తగిన మొత్తంలో ఆహారం నుంచి పోషకాలు లభించాలి.అందులో రాగి( Copper ) అనేది అవసరమైన పోషకాలలో ఒకటి.

ఇది శరీరానికి తక్కువ పరిమాణంలో ఉంటే సరిపోతుంది.అది లోపిస్తే, మాత్రం అనేక దుష్ప్రభావాలు తలెత్తుతాయి.

Telugu Care, Tips, Healthy, Lack Copper, Problems Occur-Latest News - Telugu

శరీరంలోని ఎర్ర రక్త కణాలు, నరాల కణాలను( Red blood cells, nerve cells ) నిర్మించడంలో, రోగనిరోధక వ్యవస్థను ( immune system )సక్రమంగా ఉంచడంలో ఇది ప్రత్యేక పాత్ర పోషిస్తుంది.ఈ రాగి అనేది కాలేయం, గుండె, మూత్రపిండాలు, మెదడు, అస్థిపంజర కండరాలలో కనిపిస్తుంది.ముఖ్యంగా రాగి మెదడు పని తీరును ప్రభావితం చేస్తుంది.కాపర్ లోపం ఉన్నట్టయితే గుండె జబ్బులు, రక్తహీనత వంటి సమస్యలు వచ్చే ప్రమాదం లేకేపోలేదు.శరీరంలో రాగి అసమతుల్యత అల్జీమర్స్ వ్యాధి ( Alzheimer’s disease )ప్రమాదాన్ని కూడా పెంచుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

Telugu Care, Tips, Healthy, Lack Copper, Problems Occur-Latest News - Telugu

అంతేకాకుండా రాగి లోపం ఉన్నవారిలో ఎముకల సాంద్రత తక్కువగా ఉండి, బొల్లు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం వుంది.ఆర్థరైటిస్‌ను నివారించడంలో రాగి సహకరిస్తుంది.దాని కోసం చాలా మంది రాగి కంకణాలను ధరిస్తారు.

ఇక రాగి వివిధ ఆహారాలలో మనకు లభిస్తుంది.తృణధాన్యాలు, బంగాళాదుంపలు, బీన్స్, ముదురు ఆకుపచ్చ ఆకుకూరలు, కోకో, జీడిపప్పు, నల్ల మిరియాలు, బాదం వంటి గింజలలో కనిపిస్తుంది.

కాబట్టి ఈ పోషకాన్ని ఆహారం ద్వారా పొందాలి.రాగి లోపంతో బాధపడుతున్న వ్యక్తులు సప్లిమెంట్ల ద్వారా కూడా దానిని పొందవచ్చు… కానీ వైద్య సలహా లేకుండా సప్లిమెంట్లను వాడడం అంత మంచిది కాదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube