ఇటీవల కాలంలో కోట్లాది మందిని కలవరపెడుతున్న సమస్య నిద్రలేమి.ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు తదితర కారణాల వల్ల రాత్రుళ్లు ఎంత ప్రయత్నించినా కూడా కొందరికి నిద్ర పట్టదు.
కంటిని నిద్ర లేకపోవడం వల్ల ఆరోగ్యం క్రమక్రమంగా దెబ్బతింటుంది.కాబట్టి నిద్రలేమిని వదిలించుకోవడం చాలా అవసరం.
అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే గోల్డెన్ మిల్క్ ఎంతో అద్భుతంగా తోడ్పడుతుంది.రోజు నైట్ ఈ గోల్డెన్ మిల్క్( Golden Milk ) ను తాగితే నిద్రలేమి దెబ్బకు పరార్ అవుతుంది.
మరి ఇంతకీ ఆ గోల్డెన్ మిల్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అంగుళం దాల్చిన చెక్క, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, ఐదు యాలకులు, అంగుళం శొంఠి కొమ్ము, వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పొడిని ఒక బాక్స్ లో నిప్పుకుని స్టోర్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ ఆవు పాలు పోసుకోవాలి.
పాలు కాస్త మరిగిన తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ తయారు చేసుకున్న పొడి వేసి నాలుగు నిమిషాల పాటు మరిగించాలి.చివరిగా వన్ టేబుల్ స్పూన్ బెల్లం( Jaggery ) తురుము, వన్ టేబుల్ స్పూన్ నెయ్యి( Ghee ) వేసి మరొక నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన గోల్డెన్ మిల్క్ సిద్ధమవుతుంది.
ఈ మిల్క్ ను గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.రోజు నైట్ ఒక గ్లాస్ చొప్పున ఈ గోల్డెన్ మిల్క్ ను తాగితే నిద్రలేమి సమస్యను చాలా సులభంగా జయించవచ్చు.ఈ మిల్క్ నిద్రను ప్రేరేపించే హార్మోన్ల ఉత్పత్తికి తోడ్పడుతుంది.ప్రశాంతమైన సుఖమైన నిద్రను అందిస్తుంది.నిద్ర నాణ్యతను కూడా పెంచుతుంది.ప్రశాంతంగా నిద్రించాలి అనుకునే వారు కచ్చితంగా రోజు నైట్ ఈ గోల్డెన్ మిల్క్ ను తీసుకోండి.
పైగా ఈ మిల్క్ రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.ఎముకలు, కండరాలను బలోపేతం చేస్తుంది.
మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.గుండె జబ్బులు వచ్చే రిస్క్ ను సైతం తగ్గిస్తుంది.