చైనాలోని( China ) షెన్‌జెన్‌లో ఉన్న ఇన్‌స్టా360( Insta360 ) అనే ఓ టెక్ కంపెనీ తాజాగా ఉద్యోగులకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది.బరువు తగ్గండి, డబ్బు గెలుచుకోండి అనే కొత్త ప్రోగ్రామ్ ప్రారంభించింది.
ఉద్యోగులను బరువు తగ్గేలా ప్రోత్సహించడానికే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.బరువు తగ్గే ఉద్యోగులకు లక్ష యువాన్ల (దాదాపు రూ.1.17 కోట్లు) క్యాష్ ప్రైజ్ ఇస్తామని ప్రకటించింది.ఈ కార్యక్రమం చాలా పాపులర్ అయింది, వార్తలలో కూడా ఎక్కింది.
ఇన్‌స్టా360 కంపెనీ 2023 ప్రారంభంలో ఈ బరువు తగ్గించే ఛాలెంజ్‌ను( Weight Loss Challenge ) ప్రారంభించింది.ఇప్పటివరకు దాదాపు 150 మంది ఉద్యోగులు ఈ ఛాలెంజ్‌లో పాల్గొని, 800 కిలోల బరువు తగ్గారు.వారి ప్రయత్నాలకు 980,000 యువాన్ల (సుమారు 135,213 డాలర్లు) బహుమతిగా అందుకున్నారు.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, ఇన్‌స్టా360 కంపెనీ బరువు తగ్గించడానికి ఒక మూడు నెలల బూట్‌క్యాంప్ లాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.ప్రతి సెషన్‌లో 30 మంది ఉద్యోగులు పాల్గొంటారు, ఇప్పటివరకు ఐదు సెషన్లు జరిగాయి.ఈ కార్యక్రమం ముఖ్యంగా అధిక బరువు( Over Weight ) ఉన్న ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంటుంది.పార్టిసిపెంట్లను ముగ్గురు సభ్యుల సమూహాలుగా విభజిస్తారు, ప్రతి వారం వారి బరువు కొలుస్తారు.ఒకవేళ ఒక గ్రూప్ సగటున వ్యక్తికి 0.5 కిలోలు బరువు తగ్గితే, వారికి 400 యువాన్లు (సుమారు $55) బహుమతిగా లభిస్తుంది.కానీ, ఒకవేళ ఎవరైనా బరువు పెరిగితే, ఆ సమూహం మొత్తం బహుమతి కోల్పోతుంది.ప్రతి వ్యక్తి 500 యువాన్ల జరిమానా చెల్లించాలి.
లి అనే ఒక ఉద్యోగి గత నవంబర్‌లో ఈ కార్యక్రమంలో చేరాడు.ఆరోగ్యంగా ఉండాలనే కోరికతో పాటు, నగదు బహుమతి( Cash Prize ) పొందే ఆలోచన కూడా అతనికి నచ్చింది.అతను రోజూ పరిగెత్తడం, ఈత కొట్టడం, బాస్కెట్‌బాల్ ఆడటం వంటి శారీరక వ్యాయామాలు చాలా చేశాడు.అదే సమయంలో, కఠినమైన ఆహార నియమాలను కూడా పాటించాడు.కార్యక్రమం ముగిసే సమయానికి, అతను 17.5 కిలోలు బరువు తగ్గాడు, 7,410 యువాన్ల (సుమారు రూ.83,526) బహుమతిని అందుకున్నాడు.
బరువు తగ్గడం తర్వాత తాను చాలా బాగా ఉన్నానని, చురుకుగా ఉన్నానని అతను చెప్పాడు.
ముఖం సన్నగా అయిందంట.కడుపు కొవ్వు తగ్గిందట.
ముఖ్యంగా బాస్కెట్‌బాల్ ఆడుతున్నప్పుడు తనకు చాలా శక్తి ఉందని అతను గమనించాడు.ఇప్పుడు ఉద్యోగంలో అతడు బాగా పనిచేస్తున్నాడు.
ఈ కార్యక్రమం ఉద్యోగులు, సంస్థ రెండింటికీ లాభదాయకంగా ఉండటం చాలా సంతోషకరమైన విషయమని పలువురు కామెంట్లు చేస్తున్నారు.