టాలీవుడ్ హీరో మంచు మనోజ్( Manchu Manoj ) గురించి మనందరికీ తెలిసిందే.మోహన్ బాబు తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా మంచి గుర్తింపుని ఏర్పరచుకున్నారు.
ఇకపోతే మంచం మనోజ్ చివరిగా ఒక్కడు మిగిలాడు( Okkadu Migiladu Movie ) అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే.ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాలో నటించలేదు.
దాంతో సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసి వ్యాపారాలు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ బిజీబిజీగా మారిపోయారు.ఇక మనోజ్ ఇటీవలే రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
భూమా మౌనిక రెడ్డిని( Bhuma Mounika Reddy ) రెండవ వివాహం చేసుకున్నారు.
అయితే అంతకంటే ముందే తన కొత్త సినిమాని ప్రకటించారు.ఈ ఏడాది ప్రారంభంలో వాట్ ది ఫిష్( What The Fish ) అంటూ ఒక కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు.గేమింగ్ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని సమాచారం.
టైటిల్‌తో పాటు విడుదల చేసిన పోస్టర్‌లో మంచు మనోజ్ వెనక్కి తిరిగి కనిపిస్తున్నాడు.పోస్టర్‌లో ఉన్న కార్లు, బైక్‌లు మనోజ్ నిల్చోన్నవైపు వస్తోన్నట్లుగా కనిపించడం ఆసక్తిని పంచుతోంది.
టైటిల్‌తో పాటు మనం మనం బరంపురం అనే క్యాప్షన్ ను కూడా జోడించారు.ఈ మూవీకి వరుణ్ దర్శకత్వం వహించబోతున్నారు.
డైరెక్టర్‌గా అతడికి ఇదే మొదటి సినిమా కావడం విశేషం.డార్క్ కామెడీ థ్రిల్లర్ కథాంశంతో వాట్ ద ఫిష్ సినిమాను తెరకెక్కించనున్నారు.
కెనడా, టొరంటోలలో 75 రోజుల పాటు షూటింగ్ చేయనున్నట్లు ప్రకటించారు.
డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో షూట్ చేయనున్న ఈ సినిమాను పాన్ ఇండియన్ లెవల్‌లో రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో ఈ సినిమాను ఆపేశారని అందరూ భావించారు.కానీ తాజాగా అప్ డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్.
చాలా ఏళ్ళ తర్వాత మనోజ్ మళ్లీ కెమెరా ముందుకొచ్చినట్టు యూనిట్ తెలిపింది.ఈ సందర్బంగా ఒక ఫోటోని విడుదల చేసింది.
ఇందులో కెమెరాకి మనోజ్ నమస్కరిస్తున్నారు.అయితే ఇది ఏ సినిమా షూటింగ్ కోస మనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం మనోజ్ కమిట్ అయిన వాటిలో నాలుగైదు ప్రాజెక్ట్ లు ఉన్నాయట.దీంతో పాటు ఒక బిగ్గెస్ట్ రియాలిటీ షో కూడా చేయబోతున్నారట.
మరి వీటిలో ఏది ముందు స్టార్ట్ చేస్తారనేది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.అయితే ముందుగా బిగ్గెస్ట్ రియాల్టీ షో తో ప్రేక్షకులను పలకరిస్తారా లేదా సినిమాతో పలకరిస్తే అన్నది చూడాలి మరి.