ఛలో, భీష్మ, పుష్ప వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆమె ఎవరో అందరికి తెలుసు.
నేషనల్ క్రష్ గా ప్రేక్షకుల చేత పిలిపించుకుంటూ రష్మిక మందన్న ( Rashmika Mandanna ) పాన్ ఇండియన్ వ్యాప్తంగా అన్ని భాషల్లో వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకు పోతుంది.

అయితే ఈమె గత కొంత కాలంగా వరుస ప్లాప్స్ అందుకోవడంతో ఈమె పని అయిపోయింది అని ఇక అవకాశాలు రావడం కష్టమే అని అంతా అనుకున్నారు.విజయ్ వారిసు విజయం సాధించిన అది విజయ్ ఖాతాలోకి వెళ్ళిపోయింది.అలా కోలీవుడ్ లో రెండు చేస్తే రెండు ప్లాప్ అయ్యాయి.
ఇక బాలీవుడ్ ( Bollywood )లో చేసినవన్నీ బోల్తా కొడుతున్నాయి.అయినా కూడా ఈ అమ్మడికి అవకాశాలు వస్తున్నాయి.

మరి ఈ నేపథ్యంలోనే తాజాగా రష్మిక తన కెరీర్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.జీవితంలో ప్రతీ ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఒక టైం అనేది వస్తుంది.అలా తనకు ఇప్పుడు మంచి రోజులు నడుస్తున్నాయని.తనకు మంచి రోల్స్ రావడం సంతోషంగా ఉందని ఈమె చెప్పుకొచ్చింది.ఈ భామ తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇక ప్రస్తుతం పుష్ప సీక్వెల్ లో నటిస్తూనే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.
అలాగే బాలీవుడ్ లో ఈమె చేస్తున్న యానిమల్ సినిమా గురించే ఇప్పుడు ఎక్కడ చూసిన రచ్చ జరుగుతుంది.యానిమల్ లో అమ్మడు రణబీర్ తో చేసిన లిప్ లాక్స్ తో అమ్మడి పేరు మారుమోగి పోతుంది.
ఇక వీటితో పాటు రెయిన్ బో సినిమా కూడా చేస్తుంది.అలాగే కోలీవుడ్ లో ధనుష్( Dhanush ) సరసన కూడా ఒక మూవీ చేస్తుంది.
దీనిని మన టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నాడు.







