ఎగ్జైటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసిన కొరటాల.. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో దేవర షూట్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్( Young Tiger NTR )హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”దేవర”.ఈ సినిమాకు మొన్న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే రోజే టైటిల్ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.”దేవర”( Devara ) అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేయగా ఈ సినిమాపై మరింత హైప్ నెలకొంది.మంచి పవర్ ఫుల్ స్టోరీతోనే ఎన్టీఆర్ తో కొరటాల సినిమా తెరకెక్కిస్తున్నాడు అని తెలుస్తుంది.

 Ntr And Koratala Siva Devara Movie Latest Update, Devara, Ntr, Koratala Shiva, N-TeluguStop.com
Telugu Devara, Janhvi Kapoor, Koratala Shiva, Ntr, Saif Ali Khan-Movie

ఇది పాన్ ఇండియన్ సినిమా కావడంతో కొరటాల అన్ని ఇండస్ట్రీలోని నటీనటులను ఎంపిక చేస్తూ ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్ గా ఫిక్స్ అవ్వగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పోషించనున్నారు.ఈ ఇద్దరు ఈ సినిమాలో భాగం కావడంతో ఈ సినిమాపై బాలీవుడ్ లో కూడా ఆసక్తి నెలకొంది.

ఇక తాజాగా ఎన్టీఆర్ తన వెకేషన్ ముగించుకుని హైదరాబాద్ చేరుకోవడంతో కొరటాల మరో షెడ్యూల్ ప్లాన్ చేసి పెట్టాడు.

ఈ సినిమాలో తారక్ అతి త్వరలోనే జాయిన్ కానున్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసిన ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ పై అప్డేట్ బయటకు వచ్చింది.

నెక్స్ట్ షెడ్యూల్ కోసం కొరటాల ఎగ్జైటింగ్ గా ప్లాన్ చేసాడట.

Telugu Devara, Janhvi Kapoor, Koratala Shiva, Ntr, Saif Ali Khan-Movie

ఈ షెడ్యూల్ లో తారక్ తో పాటు సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ పై ఇంట్రెస్టింగ్ సీన్స్ షూట్ చేయనున్నట్టు తెలుస్తుంది.మరి ఈ కీలక సన్నివేశాల కోసం ఎన్ని రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసారో తెలియదు కానీ ఇప్పుడు ఈ షెడ్యూల్ పై ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు.ఇక ఎన్టీఆర్ కూడా ఈ ఏడాది ఎండింగ్ లోపే ఈ సినిమా షూట్ మొత్తం కంప్లీట్ అయ్యేలా పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube