సినిమాకి ముడి సరుకు కథ ….కథ మాత్రమే సినిమాను ఎక్కడికైనా తీసుకెళుతుంది.
ఆ ఒకటి లేకపోతే చిత్రాన్ని సరిగా ముందుకు తీసుకెళ్లడం దర్శకుడు వల్ల కాదు.దానిని ప్రేక్షకులు కూడా ఆదరించరు.
అలా వచ్చిన సినిమాలు ఏవి కూడా సరిగా సక్సెస్ అయిన దాఖలాలు లేవు.సరైన కథ లేకుండా హిట్ అయిన సినిమాలు కమర్షియల్ గా హిట్( Commercial Hit Movies ) అని అంటారు.
కానీ జనాలు మాత్రం ఆ చిత్రాలను ఎక్కువ కాలం గుర్తు పెట్టుకోరు.అలా కాకుండా కొన్నిసార్లు అద్భుతమైన కంటెంట్ తో తెరకెక్కి తండ్రి కొడుకుల అనుబంధం( Father Son Relation ) ఎలా ఉంటుందో అర్థం చేసేలా చెప్పిన చిత్రాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నాన్నకు ప్రేమతో

జూనియర్ ఎన్టీఆర్ కొడుకు పాత్రలో రాజేంద్రప్రసాద్ తండ్రి పాత్రలో వచ్చిన చిత్రం నాన్నకు ప్రేమతో( Nannaku Prematho ) ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు.టాలీవుడ్ లో అద్భుతమైన తండ్రి కొడుకుల అనుబంధానికి సంకేతకంగా వచ్చిన సినిమాల్లో ఇది కూడా ఒకటి.2016 లో వచ్చిన ఈ సినిమా తర్వాత కొన్ని రోజులకే హరికృష్ణ మరణించడం జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) కెరియర్ లోనే మరిచిపోలేని ఒక విషయం.
s/o.సత్యమూర్తి

ప్రకాష్ రాజ్( Prakash Raj ) తండ్రి పాత్రలో అలాగే అల్లు అర్జున్ కొడుకు పాత్రలో నటించిన ఈ చిత్రం కూడా ప్రేక్షకులలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.ఈ సినిమా అల్లు అర్జున్( Allu Arjun ) కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలిచిపోయింది.2015 లో వచ్చిన ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించింది.
సుర్య s/o కృష్ణన్

సూర్య( Hero Suriya ) మాత్రమే తండ్రి కొడుకులుగా నటించినా ఈ సినిమా తమిళంలో మొదట రాగా దానిని తెలుగులో డబ్బింగ్ చేసి వదిలారు.ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా ఘనవిజయాన్ని సాధించింది సమీరా రెడ్డి, సిమ్రాన్, దివ్య స్పందన హీరోయిన్స్ గా నటించారు.వారణం ఆయిరం అనే పేరుతో 2008లో తమిళంలో ఈ చిత్రం మొదట విడుదలైంది.
ఆనిమల్

2023లో వచ్చిన అనిమల్ సినిమా( Animal ) కూడా తండ్రి కొడుకుల అనుబంధమే ప్రధాన ఆ విధంగా తెరకెక్కింది ఈ చిత్రంలో రణబీర్ కపూర్( Ranbir Kapoor ) కొడుకు పాత్రలో నటిస్తే అనిల్ కపూర్ తండ్రి పాత్రలో నటించాడు.ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించగా ఈ చిత్రం మంచి ఘనవిజయం సాధించింది.







