టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య సమంత విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే.ఈ జంట విడాకులు తీసుకొని విడిపోయి ఏళ్ళు కావస్తున్నా కూడా ఇప్పటికీ వీరి విడాకుల విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అని చెప్పవచ్చు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఉన్నపలంగా విడాకులు తీసుకొని విడిపోతున్నట్లు ప్రకటించి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు.అభిమానులు విడాకుల వార్తను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.
అంతేకాకుండా ఇప్పటికీ విడాకులకు గల కారణం ఏంటి అనేది ఇద్దరూ స్పందించలేదు.

అయితే విడాకులకు గల కారణాలు ఏంటి అన్న విషయం గురించి సమంత నాగ చైతన్యలకు అనేకసార్లు ప్రశ్నలు ఎదురైనప్పటికీ వాటిని ఎప్పటికప్పుడు దాటేస్తూ వచ్చారు.ప్రస్తుతం ఈ జంట ఎవరికి వారు ఎవరికి ఏమి కారు,ఒకరితో మరొకరికి ఎటువంటి సంబంధాలు పరిచయాలు లేవు అన్నట్టుగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి( Astrologer Venu Swamy ) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
గతంలో సమంతా( Samantha ) నాగచైతన్య( Naga Chaitanya ) విడాకుల సమయంలో కూడా వేణు స్వామి పేరు మారు మోగిన సంగతి మనందరికీ తెలిసిందే.సమంత నాగచైతన్య విడిపోతారని నేను ముందే చెప్పాను అంటూ వేణు స్వామి అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

అప్పటినుంచి చాలామంది సెలబ్రిటీల విషయంలో ఇలాగే కామెంట్ చేశారు వేణు స్వామి.తాజాగా ఈ విడాకులకు గల కారణాలు చెప్పి మరో షాక్ ఇచ్చారు.నాగ చైతన్య- సమంత పెళ్లి బంధం నిలవకపోవడానికి అసలు కారణం గ్రహాలు అనుకూలించకపోవడమే అని వీళ్లిద్దరి జాతకంలో శని( Shani ) ఉచ్ఛ స్థితిలో ఉందని, అందుకే వీళ్లు కలిసి ఉండలేరు అని ముందే చెప్పానని అన్నారు.ఇలా ఉన్న జాతకస్తులకు రెండు, మూడు పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.
వ్యక్తిగత కారణాలతో విడిపోయిన చై సామ్ జోడీపై లెక్కలేనన్ని వార్తలు వచ్చాయి.బోలెడన్ని రూమర్లు షికారు చేశాయి.
ఇప్పటికీ చై సామ్ డివోర్స్ ఇష్యూ చర్చల్లోనే ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ప్రస్తుతం అటు సమంత, ఇటు నాగ చైతన్య వారి వారి కెరీర్ పై పూర్తి ఫోకస్ పెట్టి వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.
కానీ ఒక రూపంలో ఈ ఇద్దరూ వార్తల్లో నిలుస్తూనే వస్తున్నారు.