ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టె తేనే గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

తేనెను మన పూర్వీకుల కాలం నుండి వాడుతూ ఉన్నారు.తేనే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది.

 Surprising Health Benefits Of Honey Details, Honey, Health Benefits, Pure Honey,-TeluguStop.com

తేనెలో సహజసిద్ధమైన యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.కాస్త అలసటగా ఉన్నపుడు ఒక స్పూన్ తేనే తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది.

తేనెతో ఏ పదార్ధం కలిపి తీసుకుంటే ఏ అనారోగ్య సమస్యలు తగ్గుతాయో తెలుసుకుందాం.చిన్న పిల్లలో విరేచనాలు అయినప్పుడు తేనెలో జాజికాయ పొడిని కలిపి ఇస్తే విరేచనాలు తగ్గిపోతాయి.

తేనె, పాల మీద మీగడ, రోజ్ వాటర్‌లను సమాన పరిమాణంలో తీసుకోని పెదాలకు రాసుకుంటే నల్లని పెదాలు గులాబీ రంగులోకి మారటమే కాకుండా మృదువుగా మారతాయి.కీళ్లనొప్పులు ఉన్నవారు దాల్చినచెక్క కషాయంలో కొంచెం తేనే కలిపి త్రాగితే తక్షణ ఉపశమనం కలుగుతుంది.

శనగపిండిలో తేనే కలిపి ముఖానికి రాసి పావుగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారటమే కాకూండా నల్లని మచ్చలు తొలగిపోతాయి.

ఒక స్పూన్ నిమ్మరసంలో ఒక స్పూన్ తేనే కలిపి త్రాగితే గొంతు సంబంధ సమస్యలు తొలగిపోతాయి.

ఈ మిశ్రమాన్ని గాయాలపై రాస్తే త్వరగా మానిపోతాయి.ఒక స్పూన్ నిమ్మరసంలో ఒక స్పూన్ తేనే కలిపి త్రాగితే కడుపు ఉబ్బరం, ఆయాసం మరియు జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి.

నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడుతున్నవారు రాత్రి పడుకొనే సమయంలో ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో ఒక స్పూన్ తేనే కలిపి త్రాగితే ఆ సమస్య నుండి బయట పడవచ్చు.బరువు తగ్గాలని అనుకునేవారు ఉదయం పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో తేనే కలుపుకొని త్రాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.

Surprising Health Benefits Of Honey Details, Honey, Health Benefits, Pure Honey, Digestive Problems, Skin Care, Sleeplessness, Weight Loss, Telugu Health Tips, Honey Health Benefits - Telugu Benefits, Honey, Honey Benefits, Pure Honey, Skin Care, Sleeplessness, Telugu Tips

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube