కేసీఆర్ జాతీయ పార్టీ ... ఏపీలో సందడే సందడి !

తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త జాతీయ పార్టీని ప్రకటించేశారు.దానికి బీఆర్ఎస్ అని పేరు కూడా పెట్టేశారు.21 ఏళ్లుగా ఉన్న టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితి లో విలీనం చేసేశారు.దేశవ్యాప్తంగా కెసిఆర్ పార్టీపై అన్ని రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.

 Cm Kcr Brs Party Banners In Andhra Pradesh Details, Kcr, Telangana, Trs, Brs, Br-TeluguStop.com

ఇక కొన్ని రాష్ట్రాల్లో ముందుగా ఎన్నికల్లో పోటీ చేసి క్రమక్రమంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేయాలని,  బిజెపికి రాజకీయ ప్రత్యామ్నాాయంగా భారత్ రాష్ట్ర సమితిని బలోపేతం చేయాలని కెసిఆర్ ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికి దీనిపై తెలంగాణలోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతుండగానే… పక్కనే ఉన్న ఏపీలో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హడావుడి నెలకొంది.

కేసీఆర్ పార్టీ ప్రకటించగానే ఏపీలో హడావుడి మొదలైంది.

ఫ్లెక్సీలు, పోస్టర్లతో కొంతమంది హడావుడి చేయడమే కాకుండా, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున అభ్యర్థులుగా ప్రకటించుకుంటూ.

ప్లెక్సీలు బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది.విజయవాడలో బండి రమేష్ అనే వ్యక్తి పెద్ద ఎత్తున పోస్టర్ లను అనేక ప్రాంతాల్లో అంటించారు.

 ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలోనూ బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి.అంతేకాకుండా ఆ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా అమ్మాజీ అనే పేరుని కూడా ప్రకటించుకుని అనేక ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఇక ఎక్కడిక క్కడ ఇదే రకమైన హడావుడ కనిపిస్తోంది.
 

ప్రస్తుతం ఏపీలో టిడిపి, వైసిపి, బిజెపి, జనసేన వంటి పార్టీలు ఉన్నాయి.రాబోయే ఎన్నికల్లో అధికారం దక్కించుకునేందుకు ఈ పార్టీలన్నీ పోటీపడుతున్నాయి.అయితే అనూహ్యంగా ఇప్పుడు కేసీఆర్ జాతీయ పార్టీ తెరపైకి రావడం, ఏపీ లోను పోటీ చేసేందుకు సిద్ధమంటూ ప్రకటనలు చేయడంతో మిగిలిన రాజకీయ పార్టీల్లో ఆందోళన మొదలైంది.

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈ పరిణామాలపై ఆందోళన చెందుతోంది.కేసీఆర్ పార్టీ అంటూ ఏపీలో పోటీ చేస్తే దెబ్బ తినేది ఏ పార్టీ అనే టెన్షన్ టిడిపిలో నెలకొంది.

కెసిఆర్ పార్టీపై చంద్రబాబు స్పందించకపోయినా,  ఆ పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అనేక విమర్శలు చేశారు.మొత్తంగా ఏపీలో బీఆర్ ఎస్ పార్టీ కి సంబందించిన సందడి మొదలయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube