సినిమా అనగానే హీరో, హీరోయిన్, మిగతా క్యారెక్టర్లు అంటూ చాలా ఉంటాయి.కానీ ప్రతి సినిమాకి అందరూ ఉండాల్సిన అవసరం లేదు.
కొన్నిసార్లు సినిమాలో హీరోయిన్ లేకపోయినా ఫైట్స్ లేకపోయినా సాంగ్స్ లేకపోయినా కూడా బాగానే ఉంటాయి.కొన్నిసార్లు అయితే ఒకటి లేదా రెండు క్యారెక్టర్స్ తో సినిమా మొత్తం తీసేస్తారు.
మొన్న టాలీవుడ్ అనగానే ఆరు పాటలు, మూడు ఫైట్స్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే.దానికి తోడు కామెడీ, మాస్, యాక్షన్ అంటూ అన్ని అవసరం ఉన్న లేకపోయినా జొప్పించి మరీ సినిమా తీసి ప్రేక్షకుల ముందుకు వదులుతారు.
అలా లేకపోతే ప్రేక్షకులు ఒప్పుకోరు అనే ధోరణి అందరి హీరోల్లో అలాగే మేకర్స్ లో కనిపిస్తూ ఉంటుంది.కానీ కొన్ని సందర్భాల్లో హీరోయిన్ అవసరం లేకుండా బలవంతంగా ఉండాలి కాబట్టి పెడుతున్నారు.
అలా అవసరం లేకున్నా కూడా హీరోయిన్ పెట్టి తీసిన సినిమాలు ఏంటో ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ సందర్భంగా వకీల్ సాబ్ సినిమా( Vakeel Saab Movie ) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.ఈ సినిమా పూర్తిగా ముగ్గురు ఆడపిల్లల జీవితంలో రాత్రి జరిగిన ఒక సంఘటన పై అలాగే దానికి సంబంధించిన కేసు, కోర్టు అంటూ సాగుతుంది.ఈ సినిమాలో వకీల్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించాడు.
కానీ ఈ సినిమాకి అసలు హీరోయిన్ అవసరం లేదు.ఏదో పెట్టాలని పెట్టినట్టుగా ఉంటుంది.
అలాగే సరిలేరు నీకెవరు( Sarileru Neekevvaru ) సినిమాలో సైతం రష్మిక మందన( Rashmika Mandanna ) ఈమాత్రం పోపులేని పాత్ర చేసింది.అసలు ఈ సినిమాకి ఆ పాత్రకి ఎటువంటి సంబంధం ఉండదు.
మరి మహేష్ బాబు సినిమా అంటే ఆ మాత్రం పాటలు ఉండాలిగా.ఆ రొమాన్స్ కోసం హీరోయిన్ ఉండాలిగా.
ఇక స్పైడర్ సినిమా( Spyder Movie ) గురించి ఈ సందర్భంగా చెప్పకపోతే అది పెద్ద తప్పు అవుతుంది.రకుల్ ప్రీత్ సింగ్( Rakul Preet Singh ) ఈ సినిమాలో ఎందుకు ఉందో ఏ ఒక్కరికి అర్థం కాదు.ఆమెను పెట్టారు కాబట్టి ఒకటి రెండు సీన్స్ ఆమె చుట్టూ రాసి అలాగే ఒక రెండు డ్యూయేట్స్ పెట్టేసాడు దర్శకుడు.ఇక బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి( Veerasimha Reddy ) సినిమాలో కూడా హీరోయిన్ అవసరమే లేదు ఆమె లేకుంటే యా సినిమా ఇంకా బాగుంటుంది కానీ శృతిహాసన్( Shruti Haasan ) తో హీరోయిన్ పాత్ర వేయించారు అవసరం లేకపోయినా.