కలిసి ఉంటున్నారు సరే.. మరి విడాకులు ఎందుకు తీసుకున్నారు ?

అమీర్ ఖాన్, కిరణ్ రావు… ఈ జంట గురించి బాలీవుడ్ లో కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఆమీర్ ఖాన్( Aamir Khan ) సినిమాలో నటిస్తున్న క్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న కిరణ్ రావు తో( Kiran Rao ) ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు.

 Why They Are Staying Together Aamir Khan Kiran Rao Details, Aamir Khan, Kiran Ra-TeluguStop.com

బాలీవుడ్ లో విడాకులు ట్రెండ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది విడాకులు తీసుకున్న కూడా వారు అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటారు.ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే అయితే అమీర్ ఖాన్, కిరణ్ రావు విషయంలో ఒక అడుగు ఎక్కువే కనిపిస్తుంది.

ప్రస్తుతం కిరణ్ రావు తన సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉంది.అయితే ఒక ప్రమోషన్ ఇంటర్వ్యూ సందర్భంగా తన వ్యక్తిగత జీవితంలోని అనేక విషయాలను మీడియాతో పంచుకుంది.

Telugu Aamir Khan, Aamirkhan, Bollywood, Kiran Rao-Movie

తను అమీర్ ఖాన్ తో విడాకులు( Divorce ) తీసుకున్న మాట కూడా నిజమే కానీ తాము ఎప్పుడు కలిసే ఉంటామని అలాగే ఎప్పుడూ వ్యక్తిగత జీవితం కన్నా కూడా సినిమాల గురించే ఆలోచిస్తుంటామని వారి తప్ప మా ఇద్దరికీ మరో ప్రపంచం లేదు అంటూ చెప్పుకొచ్చింది కిరణ్.మా ఇద్దరి మధ్య ఉన్న బంధం వివాహానికి ( Marriage ) మించి ఉంటుందని చాలా నిజాయితీ తో కూడిన రిలేషన్ మెయింటైన్ చేస్తున్నామని మా కుటుంబం మొత్తం కూడా ఈ విషయం తెలుసు అని మా పెళ్లి ప్రేమ అనేది అన్ని వివాహ బంధాలకు అతీతం అంటూ చెబుతోంది.

Telugu Aamir Khan, Aamirkhan, Bollywood, Kiran Rao-Movie

ఈ ఇంటర్వ్యూ చూసిన వారంతా కూడా కలిసి ఉన్నప్పుడు విడాకులు ఎందుకు తీసుకున్నారు అనే ప్రశ్న వేస్తున్నారు.ఎప్పుడో కలిసే ఉండేవారు కొత్తగా విడాకులు తీసుకుని విడిపోయాము అని చెప్పుకోవడంలో అర్థం లేదు కదా ఆ మాత్రం దానికి విడాకులు ఎందుకు అనే ప్రశ్న బాగా వినిపిస్తుంది.అయితే కిరణ్ మరియు అమీర్ ఖాన్ ఇద్దరు కూడా అతడి మొదటి భార్య కుమార్తె వివాహంలో కలిసి సందడి చేశారు.వీరి అన్యోన్యత చూసిన వారు ఎవరూ కూడా వీరు విడాకులు తీసుకున్నారంటే నమ్మలేరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube