నేడు దాదాపుగా అందరూ ఏదో ఒక రూపంలో కంప్యూటర్( Computer ) ని వాడేవారే.కాబట్టి మౌస్ గురించి ప్రత్యేకంగా మీకు పరిచయం చేయాల్సిన పని లేదు.
ఇక మౌస్ తేలికగా కదలాలంటే కింద ఓ ప్యాడ్ సపోర్ట్ కావాల్సిందే కదా.బేసిగ్గా ఈ మౌస్ ప్యాడ్ అనేది సిలికాన్ లేదా రబ్బరుతో తయారు చేయబడి ఉంటుంది.అయితే గాజుతో తయారు చేసిన మౌస్ ప్యాడ్( Mouse pad ) ఎపుడైనా చూసారా? ప్రస్తుతం మార్కెట్లో అవి అందుబాటులో వున్నాయి.ఇది కంప్యూటర్ వినియోగించే వారికి సౌకర్యవంతంగా ఉండటంతో పాటు చూడటానికి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

ఈ గ్లాస్ మౌస్ ప్యాడ్ లను ఆవిష్కరించింది ఎవరంటే… గ్లోబల్ గేమింగ్, ఎస్పోర్ట్స్ కమ్యూనిటీ( Global gaming , esports community ).ఈ కంపెనీ నుంచి మొదటి గ్లాస్ మౌస్ ప్యాడ్( Glass mouse pad ) ఇది.మంచి నాణ్యతతో పాటు మన్నికగా ఉంటుందని, ప్యూర్ గా కనిపిస్తుందని ఆ కంపెనీ చెబుతోంది.కాగా దీని ధర 99.99 డాలర్లుగా ఉంది.అంటే మన భారతదేశ కరెన్సీలో దాదాపు రూ.8,265 అన్నమాట.మనకు ఈ ధరతో సెకండ్ హేండ్ కంప్యూటర్ సెట్ వచ్చేస్తుంది అనుకోండి.
అది వేరే విషయం.రేజర్ అట్లాస్ మౌస్ ప్యాడ్ ను టెంపర్డ్ గ్లాస్ తో తయారు చేశారు.
ఇది యాంటీ-స్లిప్ రబ్బర్ బేస్‌తో వస్తుంది.

కాగా ఇవి నలుపు లేదా తెలుపు రంగులో వస్తున్నాయి.0.19 అంగుళాలు మందంగా ఉంటుంది.గ్లాస్ మౌస్ ప్యాడ్ వలన వున్న ప్రధాన ఉపయోగం ఏమంటే ఇతర మౌస్‌లతో పోల్చితే దీనిని వినియోగదారుడు మునుపెన్నడూ లేనంత వేగంగా గ్లైడ్ చేయగలడు.అయితే గ్లాస్ మౌస్‌ప్యాడ్‌తో వేసవి సమయంలో మౌస్‌ని ఉపయోగిస్తున్నప్పుడు మాత్రం కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు.
ఎందుకంటే మౌస్‌ప్యాడ్‌ను ఉపయోగించడంలో చెమట ఇబ్బంది పెట్టవచ్చు.అంతేకాకుండా మౌస్ చేతిలో నుంచి జారిపోయే అవకాశం కూడా కలదు.








