కర్నూలు ప్రజలకు శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటో తెలిస్తే గాల్లో తేలిపోతారట..!

ప్రస్తుతం కర్నూలు ప్రజలకు గాల్లో తేలినట్టుందే అని పాడుకోవలసిన సమయం వచ్చినట్టుంది.ఎందుకంటే కొత్తగా నిర్మించిన కర్నూలు విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ నుండి అనుమతి లభించిందనే శుభవార్తను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

 Andhra Pradesh, Kurnool Airport, Flights, Run-TeluguStop.com

అదీగాక ఈ మార్చి నుంచే విమానాల రాక పోకలకు ఏరోడ్రోమ్‌ లైసెన్స్‌ జారీ చేసినట్లు కర్నూలు విమానాశ్రయ అధికారులు కూడా ప్రకటించారు.ఇకపోతే గత సంవత్సరం మార్చిలో ఏపీ సీయం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కర్నూలు విమానాశ్రయ పనులు వేగవంతం చేయాలని తెలుపడం, విచిత్రంగా ఈ సంవత్సరం మార్చిలోనే విమాన సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు వేగవంతం అవడంతో, రానున్న రోజుల్లో కర్నూలు దశ మారబోతుందని అనుకుంటున్నారట అక్కడి ప్రజలు.

మొత్తానికి వైసీపీ హయామంలో కర్నూల్లో విమానాశ్రయం ఏర్పడటం పలువురిని ఆనందానికి గురిచేస్తుందని తెలుస్తుంది.ముఖ్యంగా కర్నూలు ప్రజల సంతోషానికి అవధులు లేవట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube