నిర్మాణం పూర్తి అవ్వకుండానే మెగాస్టార్‌ చేతుల మీదుగా ప్రారంభం!

అక్టోబర్ 1వ తారీఖున ప్రముఖ నటుడు నిర్మాత అల్లు రామలింగయ్య గారి 100వ జయంతి వేడుకలు జరగబోతున్నాయి.అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం ఎన్నో సేవా కార్యక్రమాలను ఆ రోజు నిర్వహించబోతున్నారు.

 Allu Studio Lunch By Megastar Chiranjeevi  , Allu Studio, Megastar Chiranjeevi,-TeluguStop.com

అదే సందర్భం గా అల్లు ఫ్యామిలీ వారు నిర్మిస్తున్న భారీ ఫిలిం స్టూడియో అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవం చేయబోతున్నారు.గత ఏడాది ప్రారంభించిన అల్లు స్టూడియోస్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి.

ఎంత వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేయాలనుకున్నా వీలు పడలేదు.ఈ లోపు అక్టోబర్ 1 రానే వచ్చింది.

అల్లు రామ లింగయ్య గారి జయంతి సందర్భం గా అల్లు స్టూడియోస్ ని ప్రారంభించాలని మొదటి నుంచి భావించారు.నిర్మాణం పూర్తి కాకున్నా కూడా స్టూడియోస్ ని ప్రారంభించాలని అల్లు అరవింద్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.,/br>

Telugu Allu Aravind, Allu Studios, Chiranjeevi, Telugu-Movie

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అల్లు స్టూడియోస్ ని లాంచనంగా ప్రారంభించడంతో పాటు ఆ స్టూడియోలో 20 నుండి 25 మంది తెలుగు సినిమా పరిశ్రమ కు చెందిన కమెడియన్స్ ని సత్కరించబోతున్నారు.అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం ఆ కమెడియన్స్ కి జ్ఞాపిక ఇవ్వబోతున్నారు.అల్లు స్టూడియోస్ నిర్మాణం పూర్తి అవ్వడానికి మరో ఆరు నెలల సమయం పడుతుందని సమాచారం అందుతుంది.పూర్తి స్థాయిలో అల్లు స్టూడియో సినిమా మేకింగ్ కోసం అందుబాటులోకి 2024వ సంవత్సరంలో వస్తుందంటూ టాక్ వినిపిస్తుంది.

అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీ ని అల్లు స్టూడియోస్ వారు టాలీవుడ్ కోసం తీసుకు వస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.అల్లు స్టూడియోస్ లో మొదటగా పుష్ప 2 సినిమా షూటింగ్ జరగబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

 అల్లు స్టూడియోస్ నిర్మాణం పూర్తి అయితే ఫిల్మ్‌ మేకింగ్‌ కి నిర్మాతలకు మరింత ఈజీ అవుతుంది అంటూ టాలీవుడ్‌ వర్గాల వారు భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube