ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉన్నప్పటికి రాజకీయాలు మాత్రం హాట్ హాట్ గా సాగుతున్నాయి.వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకున్న వైసీపీ( ycp ).
ఇప్పటి నుంచే ప్రజారాల్లో ముమ్మరంగా పాల్గొంటుంది.బస్సు యాత్ర, ప్రజా సాధికార యాత్ర, గడప గడపకు మన ప్రభుత్వం.
ఇలా ఎన్నో కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు.ఇక ఈ మద్యనే వై ఏపీ నీడ్స్ జగన్( Why AP needs Jagan, )అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమంలో భాగంగా జగన్ పాలనలో జరిగిన మంచిని అధికారులు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.మరోసారి జగన్ ఏపీకి సిఎం ఎందుకు కావాలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చరని, రాష్ట్రంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారని, మరోసారి వైఎస్ జగన్ కు అధికారం ఇస్తే రాష్ట్రం మరింత అభివృద్ది పథంలో దూసుకుపోతుందని.ఇలా జగన్ పాలనపై వివరించే ప్రయత్నం చేస్తున్నారు, అయితే ఈ ” వై ఏపీ నీడ్స్ జగన్ ” కార్యక్రమం పై సెటైర్లు కూడా అంతే స్థాయిలో పెళుతున్నాయి. ఏపీకి ఇంతవరకు రాజధాని నీరించలేదని, జగన్ పాలనలో మద్యం దందా జరిగిందని, ఇసుక కుంభకోణం జరిగిందని, వేల కోట్ల ప్రజాధనం ఆగమయ్యిందని.ఇలా ఎన్నో విమర్శలు వ్యక్తం చేస్తున్నారు ప్రత్యర్థి పార్టీ నేతలు.

మరోసారి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టేస్తారని, ప్రజాధనాన్ని మొత్తం దోపిడి చేస్తారని, పెట్రోల్ ధరలు, ఆర్టీసీ ఛార్జీలు, నిత్యవసర వస్తువుల ధరలు మోత మొగిస్తారని, తన సైకో పాలనతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తారని టీడీపీ శ్రేణులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.” రాష్ట్రాన్ని నాశనం చేసేందుకే జగన్ కావాలా అంటూ సెటైర్లు వేస్తున్నారు.ఇలా టీడీపీ వైసీపీ మద్య్హ ” వై ఏపీ నీడ్స్ జగన్ ” కార్యక్రమం పై డిజిటల్ వార్ జరుగుతోంది.కాగా ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళేందుకు అధికారులు కూడా పెద్దగా ఆసక్తి కనబరచడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఎందుకంటే ” గడప గడపకు మన ప్రభుత్వం ( Gadapa Gadapa Ku Mana Prabutvam )” కార్యక్రమం ద్వారా పజల్లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలపై ప్రజా తిరుగుబాటు ఏ స్థాయిలో వ్యక్తమైందో అందరికీ తెలిసిందే.
అందుకే ” వై ఏపీ నీడ్స్ జగన్ ” కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఎలా రియాక్ట్ అవుతాయో అని భయం అధికారుల్లోనూ, వైసీపీ శ్రేణుల్లోనూ ఉందట.మరి ఈ కార్యక్రమం ఎలా ముందుకు సాగుతుదో చూడాలి.