హైదరాబాద్: హైదరాబాద్ నోవేటెల్ లో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసులు శాఖా మంత్రి ఆర్.కే.
రోజాని మర్యాదపూర్వకంగా కలిసిన కామన్వెల్త్ బంగారు పతక విజేత పి.వి.సింధు. కామన్వెల్త్ క్రీడలు 2022 మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్లో విజేతగా నిలిచిన పివి సింధు కుటుంబ సమేతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి శ్రీమతి ఆర్.కే రోజానీ హైదరాబాద్ నోవెటేల్ లో కలిశారు.అనంతరం మంత్రి రోజా కుటుంబ సభ్యులు, సింధు కుటుంబ సభ్యులు కలసి లంచ్ లో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు నుండి అందించిన సహకారానికి సింధు కృతజ్ఞతలు తెలిపారు.కామన్వెల్త్ గేమ్స్ సింగిల్స్ ఈవెంట్‌లో తొలి బంగారు పతకం సాధించిన సింధు విజయానికి యావత్ దేశం గర్విస్తోందనీ మంత్రి రోజా సిందుని కొనియాడారు.
భవిష్యత్తులో సింధు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.







