తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం RRR. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డులను కూడా అందుకుంటుంది.
ఇప్పటికే ఈ సినిమాకు గాను ఎన్నో అవార్డులు రాగా తాజాగా ఒరిజినల్ కేటగిరీలో భాగంగా నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబల్ అవార్డు వచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇక ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి.

ఇక ఈ ఈవెంట్ ప్రీ షోలో భాగంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అక్కడి విలేకరులతో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.హాలీవుడ్ డైరెక్టర్ మార్వెల్ ఇచ్చిన ఆఫర్ గురించి మాట్లాడుతూ… అవకాశం వస్తే చేస్తానని తెలిపారు.దర్శకుడు రాజమౌళి గారితో పని చేసినప్పుడే ఈ సినిమా అందరికీ రీచ్ అవుతుందని తెలుసు.అదే సినిమా ఇంత దూరం తీసుకువచ్చి తమకు అవార్డులు అందిస్తుందని ఊహించలేదని ఎన్టీఆర్ తెలియజేశారు.
ఈ క్రమంలోనే హాలీవుడ్ రిపోర్టర్ మార్క్ పుట్టినరోజు అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి ఎన్టీఆర్ తనకు చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ రిపోర్టర్ మార్క్ పుట్టినరోజు అనే విషయం తెలియగానే ఆయన ఒక గిఫ్ట్ తెప్పించి రిపోర్టర్ ఊహించని విధంగా గిఫ్ట్ ఇచ్చి తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.అయితే ఎన్టీఆర్ నుంచి ఇది ఊహించని రిపోర్టర్ మార్క్ ఒక్కసారిగా సంతోషంతో ఉబ్బితబ్బి అయిపోయి ఎన్టీఆర్ ను హగ్ చేసుకున్నారు.ఇంటికి వెళ్లిన అనంతరం రిపోర్టర్ మార్క్ ఆ బాక్స్ ఓపెన్ చేసినటువంటి వీడియోని షేర్ చేశారు.
అయితే అందులో బౌ టై చూసి ఉబ్బితబ్బిబ్బవవుతూ ఎన్టీఆర్ ది బెస్ట్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు.







