తెలంగాణ సీఐడీ చీఫ్ గోవింద్ సింగ్ ప్రయాణిస్తున్న కారు ఘోర రోడ్డుప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్రగాయాలు కాగా.
భార్య షీలా సింగ్ దుర్మరణం చెందారు.రాజస్థాన్ లోని తనోత్ మాతా ఆలయానికి వెళ్లారు.
అనంతరం తిరిగి వస్తుండగా రామ్ ఘడ్ ప్రాంతంలో కారు బోల్తా పడింది.సమాచారం అందుకున్న బీఎస్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.కాగా గోవింద్ సింగ్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.







