ధనుష్ ఐశ్వర్య కలవడం జన్మలో జరగదట.. ఆ వార్తలు అలా పుట్టాయంటూ?

కోలీవుడ్ జంట హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ ల జంట ఇటీవల విడాకులు తీసుకొని విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.గత తొమ్మిది నెలలుగా ఈ జంట దూరంగానే ఉంటున్నారు.

 Dhanush And Aishwaryaa Not Patching Up, Hero Dhanush, Aishwarya Rajinikanth, Div-TeluguStop.com

ఇక ఈ జంట విడాకులు తీసుకొని విడిపోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులతో పాటు హీరో రజనీకాంత్ సైతం బాధపడ్డారు.అభిమానులు వారిద్దరు విడిపోకూడదు అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ కూడా చేశారు.

కాగా ఐశ్వర్య రజనీకాంత్ మొదట ధనుష్ ని ప్రేమించిన విషయం తెలిసిందే.ఆ తర్వాత తన తండ్రి రజనీకాంత్ ను ఒప్పించి ధనుష్ ని పెళ్లి చేసుకుంది ఐశ్వర్య.

ఆ తర్వాత 19 ఏళ్ల పాటు కలసి వైవాహిక జీవితాన్ని గడిపిన ఈ జంట ఇటీవల విడిపోతున్నట్లు ప్రకటించింది.ఇక ఇది ఇలా ఉంటే గత వారం రోజులుగా ఈ జంట మళ్లీ ఒక్కటవుతోంది అంటూ జోరుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ వార్తలు విన్న అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.ఇది ఇలా ఉంటే ఇందుకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే.ఐశ్వర్య రజినీకాంత్,ధనుష్ ఇద్దరు కలవడం లేదట.

సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు అన్నీ కూడా అవాస్తవాలే అని తేలిపోయింది.

ఒకటవ్వడం అన్న విషయం పక్కన పెడితే కనీసం వీళ్ళు మాట్లాడుకోలేదని, మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు అని తెలుస్తోంది.ధనుష్ సన్నిహిత వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.ధనుష్, ఐశ్వర్య మళ్లీ కలుసుకోబోతున్నారు అని వినిపిస్తున్న వార్తలు అవాస్తవమని, వారిద్దరి మధ్య సాధారణ పలకరింపులు కూడా లేవని తెలిపారు.

కేవలం వారిద్దరి పిల్లలకు సంబంధించిన విషయాలను మాత్రమే చూసుకుంటున్నారు తప్ప, అంతకుమించి వారిద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు అని తెలిపినట్టు సమాచారం. పిల్లల కోసం కలిసినప్పుడు ఈ వార్తలు పుట్టుకొచ్చి ఉంటాయని, వాళ్లిద్దరూ కలవడం అన్నది ఇకపై జరగదు అని ధనుష్, ఐశ్వర్య సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube