తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి,గరికపాటి ల వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.ఇటీవల హైదరాబాద్ లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో గరికపాటి నరసింహారావు స్పీచ్ ఇస్తున్న సమయంలో పక్కనే చిరంజీవి ఫోటో షూట్ చేస్తుండడంతో వెంటనే ఆ ఫోటో సెషన్ ను ఆపి ఇక్కడికి రావాలి అంటూ చిరంజీవికి కాస్త హెచ్చరించినట్టుగా విజ్ఞప్తి చేశాడు.
దీంతో అప్పటినుంచి గరికపాటి నరసింహారావు పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరుగుతూనే ఉన్నాయి.
ఇక గరికపాటి మాటలు విన్న చిరంజీవి ఆయన అక్కడికి వచ్చి హుందాగా ప్రవర్తించిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఇక చిరంజీవి తన ప్రవర్తనతో అక్కడికే ఆ వివాదానికి పులిస్టాప్ పెట్టగా చిరంజీవి స్నేహితులు సన్నిహితులు అభిమానులు మాత్రం ఈ వివాదాన్ని తెగేదాకా లాగుతున్నారు.ఇప్పటికే పలువురు చిరంజీవి అభిమానులు ఆయన సోదరుడు నాగబాబు అభిమానులు అందరూ కలిసి సోషల్ మీడియాలో గరికపాటి పై ట్రోలింగ్స్ చేస్తూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
అంతటితో ఆగకుండా గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో కూడా వరుసగా గరికపాటి పై కౌంటర్లు వేశారు.
అంతేకాకుండా దర్శకుడు బాబి కూడా గరికపాటి పై పరోక్షంగా విమర్శలు గుర్తించిన విషయం తెలిసిందే.అయితే మరొకవైపు గరికపాటి తాను చేసిన విషయం పట్ల ఇప్పటికి పచ్చత్తాపం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.అయితే గరికపాటి చేసిన చిన్న తప్పుకు ఆయన అభిమానులు ఈ స్థాయిలో అదేపడిగా దాడి చేయడం అన్నది కొంతమందికి నచ్చడం లేదు.
అయితే చిరంజీవి ఆ వివాదానికి లిస్ట్ ఆఫ్ పెట్టినప్పటికీ అభిమానులు మాత్రం గరికపాటి పేరు సోషల్ మీడియాలో తీసుకు వస్తూనే ట్రోలింగ్స్ చేయడం చిరంజీవి గౌరవాన్ని తగ్గించి ఆయనపై వ్యతిరేకతను తీసుకొచ్చి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.ఇప్పటికైనా చిరంజీవి అభిమానులను హెచ్చరించి ఆ వివాదాన్ని ఇక్కడితో వదిలేయమని చెబుతారో లేదో చూడాలి మరి.