జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 15వ తారీకు నుండి ఉత్తరాంధ్రలో మూడు రోజులపాటు పర్యటించనున్నట్లు ఆ పార్టీ కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది.అంతేకాకుండా 16వ తారీఖు నాడు విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ‘జనవాణి’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారట.
ఈ సందర్బంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రజా సమస్యలకు సంబంధించిన వినతులను అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వీకరించనున్నారు.
ఇక ఇదే సమయంలో ఈ నెల 15, 16, 17 తారీకులలో ఉమ్మడి విశాఖపట్నం ఇంక విజయనగరం, శ్రీకాకుళం జనసేన పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు.
ఈ సమావేశంలో పార్టీ నాయకులకు పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేయనున్నారు.ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా “విశాఖ గర్జన” నిర్వహించే 15వ తారీఖు నాడు పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో పర్యటనకు సిద్ధం అవ్వడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.







