అన్ని రంగాలతో పాటు సినిమా రంగాన్ని కూడా పెద్ద దెబ్బ కొట్టింది కరోనా మహమ్మారి.కరోనా దెబ్బకు సినిమాలు రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సాహసం చేయలేకపోయారు.
కరోనా ఫస్ట్, సెకెండ్ వేవ్ ల మూలంగా సినిమాల విషయలో నిర్మాతలు చాలా ఆచితూచి అడుగులు వేశారు.విడుదల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో సినిమాలు థియేటర్లలో రిలీజైన కొద్ది రోజుల్లోనే బుల్లి తెరపైనా దర్శనం ఇచ్చాయి.థియేట్రికల్ రైట్స్ తో పాటు శాటిలైట్ రైట్స్ నూ అమ్మేస్తున్నారు నిర్మాతలు.
అందుకే సినిమాలు థియేటర్ల నుంచి వెళ్లిపోయిన రెండు వారాలకే టీవీల్లో కనిపిస్తున్నాయి.దీంతో టీవీల టీఆర్పీ రేటింగ్ ఓ రేంజిలో పెరుగుతోంది.అయితే 2021లో రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువ టీఆర్పీ రేటింగ్ సాధించిన మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
వకీల్ సాబ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా మూవీ వకీల్ సాబ్.ఈ సినిమా జీ తెలుగులో ప్రసారం అయ్యింది.ఈ సినిమాకు ఈ ఏడాది అత్యధికంగా టీఆర్పీ రేటింగ్ దక్కింది.2021లో వచ్చిన అన్ని సినిమాల కంటే వకీల్ సాబ్ చిత్రానికి కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 19.12 రేటింగ్ వచ్చింది.బుల్లి తెరపై పవన్ కల్యాణ్ సత్తా ఏంటో తెలిసింది.ఈ సినిమా థియేటర్లలో ఏ రేంజిలో సక్సెస్ అందుకుందో.అంతకు మించి బుల్లి తెర మీద సక్సెస్ అందుకుంది.
ఉప్పెన

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా తర్వాత అత్యధిక రేటింగ్ సాధించిన సినిమా ఉప్పెన.ఈ ప్రేమ కథా సినిమా 18.51 రేటింగ్ సాధించి అదరగొట్టింది.టాప్ 2 రేటింగ్ మూవీగా నిలిచింది.