మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొనియన్ సెల్వన్ విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ నెల 30వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తమిళనాడు భారీ ఎత్తున విడుదల కాబోతుంది.
తెలుగు రాష్ట్రంలో కూడా మణిరత్నం కి ఉన్న క్రేజీ నేపథ్యంలో కాస్త ఎక్కువగానే థియేటర్లలో విడుదల చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.ఈ సమయంలోనే మల్టీప్లెక్స్ లో ఈ సినిమా టికెట్ల రేట్లు చాలా తగ్గించారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అన్ని మల్టీప్లెక్స్ లో కూడా ఈ సినిమా కేవలం 150 రూపాయల టికెట్ రేట్ కి అందుబాటులో ఉండబోతుంది అంటూ ప్రచారం మొదలైంది.కానీ ఆ ప్రచారం నిజం కాదని చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.
ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుండి కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి.అందుకే సినిమాకు సంబంధించిన చిన్న విషయం కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
అందులో భాగంగానే ఎవరో సరదాగా పుట్టించిన పుకారు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది, అంతే తప్పితే నిజంగా ఈ సినిమా ని తక్కువ రేటుకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశం మణి రత్నం కి కానీ ఇతర నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకు కానీ లేదంటూ క్లారిటీ వచ్చేసింది.ఒకవేళ నిజంగానే అంత తక్కువ రేటుకు సినిమా కనుక మల్టీప్లెక్స్ లో ఉంటే అత్యధిక మంది థియేటర్లకు వెళ్లి సినిమా ను చూసి అవకాశం ఉంటుందని.
సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆ విధంగా చూసినా కూడా తప్పకుండా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ నమోదయ్యే అవకాశం ఉంది.ముందు ముందు అయినా ఫిలిం మేకర్స్ ఈ దిశగా ప్రయత్నిస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.పోనియన్ సెల్వన్ సినిమా లో విక్రమ్, ఐశ్వర్య రాయ్, త్రిష, జయం రవి, కార్తీ, ప్రకాష్ రాజ్ ఇంకా ఎంతో మంది ప్రముఖ నటీనటులు నటించారు.