హైదరాబాద్ మీర్ పేట లైంగిక దాడి కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.ఈ క్రమంలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.రాత్రి బాలికను ఇద్దరు యువతులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.
అనంతరం మూడు గంటలు బైకుపై తిప్పి బడంగ్ పేట్ లో అత్యాచారయత్నానికి పాల్పడ్డారు.బాలిక కేకలు వేయడంతో యువకులు పరారైయ్యారు.
ఈ ఘటనపై బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.ఈ నేపథ్యంలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.