పెదరాయుడు సినిమా( Pedarayudu ) తెలుగులో నేరుగా తీసిన మూవీ ఏం కాదు.తమిళంలో ‘నాటామై'( Nattamai ) సినిమాకి ఇది ఒక తెలుగు రీమేక్ గా వచ్చింది.
తమిళంలో హిట్ అయిందని దీనిని తెలుగులో తీస్తే తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.తమిళ నాటామై సినిమాలో ‘కొట్టా పాక్కుం.
కొళుందు వెత్తలయుం'( Kotta Pakkum Kolunthu Vethala ) అంటూ ఒక పాట సాగుతుంది.ఇది అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది.
తమిళంలో మ్యూజిక్ డైరెక్టర్ సిర్పి ఈ పాటను కంపోజ్ చేశాడు.ఆ పాట ట్యూన్ సూపర్ గా ఉండటంతో దాన్నే తెలుగులో ‘పెదరాయుడు’లోనూ ఉపయోగించారు.
ఆ తెలుగు పాట ‘బావవి నువ్వు.భామని నేను…’ అంటూ సాగుతుంది.

తమిళంలో ఈ పాటను వైరముత్తు రచించాడు.మనో, ఎస్.జానకి ఆలపించారు.తమిళ పాటలో గాయని జానకి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ మనసును హత్తుకుంటాయి.పాటలోని మొదటి చరణంలో ఆమె “కత్తిరి వెయిలు.కొదిప్పదుపోళె.కాచ్చల్ అడిక్కిదు ఇడుప్పుకు మేజె.” అంటూ పాడింది.తెలుగులో ఈ చరణాన్ని ‘ పైన చూస్తే తళుకుల తార.లోన చూస్తే వెన్నెల ధార’ అని సాగుతుంది.
‘కత్తిరి ఎండ ఉడికిస్తున్న విధంగా నడుముకు పైన జ్వరం వస్తోంది’ అని అర్థం వచ్చేలా తమిళంలో ఈ పాట మొదటి చరణం రాశారు.‘కత్తిరి వెయిల్’ అనే తమిళ లిరిక్స్( Tamil Lyrics ) కు తెలుగులో కత్తెర చూపులు కొడితే అని అనువదించారు.నిజానికి దీని అర్థం అది కాదు.తమిళంలో వెయిల్ అంటే ఎండ, సూర్యుడు కృత్తికా నక్షత్రంలో సాగే 25 రోజుల సమయాన్ని తమిళంలో ‘కత్తిరి వెయిల్’ అని పిలుస్తారు.
మనం తెలుగులో దీనిని ‘అగ్ని నక్షత్రం’ అని పిలుచుకోవచ్చు.తమిళ క్యాలెండర్ ప్రకారం మే 8 నుంచి మే 24 వరకు ‘కత్తిరి వెయిల్ కాలం కొనసాగుతుంది.
సాధారణంగా ఈ కాలంలో భానుడి భగభగలు చెమటలు పట్టిస్తుంటాయి.అందుకే ఎవరూ బయటికి వెళ్లరు.

పనులు చేయడానికి కూడా సాహసించరు.కత్తిరి వెయిల్ సమయాన్నే తెలుగులో ‘కత్తెర మాసం'( Kathiri Masam ) అని, ‘కర్తరి కాలం’ అని కూడా అంటారు.అయితే తెలుగు పాటల్లో ఇలాంటి పదజాలం వాడటం చాలా అరుదు తమిళంలో మాత్రం సినీ రచయితలు ఇలాంటి ప్రకృతిని కూడా పాటలలో లిరిక్స్ గా రాస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు.