ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లలో విడుదలై వారం రోజులైన సంగతి తెలిసిందే.ఈ సినిమా 8 రోజుల గ్రాస్ కలెక్షన్లు 750 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉన్నాయి.
ఈరోజు, రేపు ఆర్ఆర్ఆర్ మూవీకి బుకింగ్స్ బాగానే ఉండటంతో ఈ రెండు రోజుల్లో ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లను సాధిస్తుందని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లోని పలు ఏరియాల్లో ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది.
నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమా కలెక్షన్లు బాగానే ఉన్నాయి.అయితే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాకు భారీగా నష్టాలు తప్పవని ప్రచారం జరుగుతోంది.
ఆర్ఆర్ఆర్ మూవీ కర్ణాటక, తమిళనాడు హక్కులను భారీ మొత్తానికి విక్రయించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.కర్ణాటకలో ఈ సినిమాకు ఏకంగా 41 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది.

అయితే కర్ణాటకలో ఈ సినిమా తొలివారం కలెక్షన్లు 27.75 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.ఈ ఏరియాలో ఈ సినిమా మరో 14 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించడం సులువు కాదు.తమిళనాడు రాష్ట్రంలో ఈ సినిమా 35 కోట్ల రూపాయల బిజినెస్ చేయగా ఈ సినిమాకు 25.30 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.ఈ వీకెండ్ కలెక్షన్లను బట్టి ఈ ఏరియాల్లో ఆర్ఆర్ఆర్ ఎంత నష్టాలను మిగులుస్తుందో అంచనాకు రావచ్చు.

బాహుబలి2 మూవీ కలెక్షన్ల స్థాయిలో ఆర్ఆర్ఆర్ మూవీ హక్కులను విక్రయించడం వల్ల కొన్ని ఏరియాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.అయితే ఆర్ఆర్ఆర్ మూవీ దర్శకుడిగా జక్కన్న స్థాయిని పెంచడంతో పాటు చరణ్, తారక్ లకు పాన్ ఇండియా హీరోలుగా ఊహించని స్థాయిలో గుర్తింపు రావడానికి కారణమైంది.ఫుల్ రన్ లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 200 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించే అవకాశాలు ఉన్నాయి.







