ప్రస్తుతం టాలీవుడ్ పెద్దగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి హీరోలు హీరోయిన్లు అనే తేడా లేకుండా ప్రతి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి తనదైన శైలిలో ప్రోత్సాహం అందిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.ఇక చిరంజీవి ఎక్కడికి వెళ్లినా తన వాక్చాతుర్యంతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు.
ముఖ్యంగా ఇటీవలి కాలంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోకి వెళ్ళిన సమయంలో హీరోయిన్ల అందానికి ఫిదా అయిపోయా అంటూ తెగ బిస్కెట్లు వేస్తున్నారు మెగాస్టార్.అంతే కాదు తనతో తప్పకుండా ఒక సినిమా చేయాలి అంటూ అందరి ముందు అడిగేస్తూ హీరోయిన్లను మొహమాట పెట్టేస్తున్నారు.
ఇటీవలే తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన మిషన్ ఇంపాజిబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చీఫ్ గెస్ట్ గా వచ్చారు మెగాస్టార్ చిరంజీవి.ఝుమ్మంది నాదం సినిమా చూసిన సమయంలో తాప్సీ గ్లామర్ కు ఫిదా అయిపోయాను అంటూ చెప్పుకొచ్చారు.
తనతో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్నానని అప్పుడెందుకు రాజకీయాల్లోకి వెళ్లానో అంటు ఫన్నీ వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్.అంతేకాదండోయ్ తాప్సీతో నాకు ఒక ప్రాజెక్ట్ సెట్ చేయండి అంటూ అక్కడే ఉన్న నిర్మాతలను చిలిపిగా కోరారు.
![Telugu Anasuya, Chiranjeevi, Chirannjeevi, Krithi Shetty, Mishan, Pre, Taapsee, Telugu Anasuya, Chiranjeevi, Chirannjeevi, Krithi Shetty, Mishan, Pre, Taapsee,](https://telugustop.com/wp-content/uploads/2022/04/Chiranjeevi-praisee-heroines-in-movie-functions-detailsa.jpg )
గతంలో లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాయిపల్లవి పై ప్రశంసలు కురిపించిన చిరంజీవి బోలా శంకర్ మూవీ కి సాయి పల్లవి ఒప్పుకోక పోవడమే మంచిదయ్యింది అంటూ చెప్పుకొచ్చాడు.ఎందుకంటే చెల్లెలిగా కంటే తనతో డాన్స్ చేసే హీరోయిన్గానే సాయి పల్లవి తో సినిమా చేయాలని ఉంది అంటూ మనసులో మాట అందరి ముందు బయట పెట్టేసాడు మెగాస్టార్ చిరంజీవి.
ఇక అంతకు ముందు ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్ళిన సమయంలో కృతి శెట్టికి సూపర్ ఫ్యూచర్ వుందని ఇక త్వరగా ఆమె డేట్స్ కావాలంటే బుక్ చేసుకోవాలి అంటూ నిర్మాతలకు సూచించాడు.
![Telugu Anasuya, Chiranjeevi, Chirannjeevi, Krithi Shetty, Mishan, Pre, Taapsee, Telugu Anasuya, Chiranjeevi, Chirannjeevi, Krithi Shetty, Mishan, Pre, Taapsee,](https://telugustop.com/wp-content/uploads/2022/04/Chiranjeevi-praisee-heroines-in-movie-functions-detailss.jpg )
ఇక చలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లలో కూడా రష్మిక మందన అందాన్ని ఎంతగానో పొగడ్తలతో ముంచెత్తాడు చిరంజీవి.ఇక సరిలేరు నీకెవ్వరు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సీనియర్ హీరోయిన్ విజయశాంతి ని చూస్తుంటే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయ్ అని గుండె జారి పోతుంది అంటూ ఫన్నీ కామెంట్లు చేసి అందర్నీ నవ్వించారు.ఇక ఓ పిట్ట కథ సమయంలో కూడా అనసూయను చూసి ఇలాగేసరదాగా మాట్లాడారు మెగాస్టార్ చిరంజీవి.