చలికాలంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈ అద్భుతమైన చిట్కాను పాటిస్తే సరి..

ప్రస్తుతం ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోయి చలి తీవ్రత ఎక్కువగా ఉంది.దీనివల్ల చాలా రకాల వైరస్లు ప్రజల మీద దాడి చేస్తున్నాయి.

 Follow This Amazing Tip To Boost Immunity In Winter ,boost Immunity ,winter,amaz-TeluguStop.com

ఎన్ని రకాల జాగ్రత్తగా తీసుకున్న ప్రజలు ఏదో ఒక అనారోగ్య బారిన పడుతూనే ఉన్నారు.ఇలా ఇన్ఫెక్షన్ల బారినపడడానికి ప్రధాన కారణం మన శరీరంలోని రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడమే.

మన శరీరంలో ఉండే వైరస్లు, బ్యాక్టీరియాలోనీ మలిన పదార్థాలు బయటకు పోవాలంటే మన శరీరంలో తగినంత శక్తి ఉండడం ఎంతో ముఖ్యం.

మనం తీసుకునే ఆహారం ద్వారా, తాగే నీటి ద్వారా, గాలి ద్వారా మన శరీరంలోకి ఇలాంటి వైరస్లు ప్రవేశిస్తూ ఉంటాయి.

అందువల్ల కొందరు ప్రజలు అనారోగ్యా సమస్యల బారిన పడుతూ ఉంటారు.ఎందుకు ఇలా జరుగుతుందంటే వారి శరీరంలో తగినంత రోగా నిరోధక శక్తి ఉండకపోవడమే.అందువల్ల మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటే ఎటువంటి వైరస్లు దాడి చేసిన మనల్ని ఏమీ చేయలేవు.కొన్ని రకాల చిట్కాలను పాటించడం వల్ల సహజ సిద్ధంగానే మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునే అవకాశం ఉంది.

దీనికోసం ప్రతి రోజు మనం నాలుగు నుంచి ఐదు లీటర్ల నీరు కచ్చితంగా తాగాలి.అలాగే రెండుసార్లు మలవిసర్జన చేయడం కూడా మంచిదే.

దీనివల్ల మన జీర్ణాశయ పేగులు శుభ్రం అవుతాయి.అంతేకాకుండా సాయంత్రం పూట ఆహారాన్ని ఆరు నుంచి ఏడులోపే తినడం ఎంతో ముఖ్యం.

దీంతో తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.

మన శరీరంలోని వ్యర్ధాలు బయటకు వెళ్ళిపోతే మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంది.అంతేకాకుండా సాయంత్రం పూట తేలికైన ఆహారాన్ని తీసుకోవడమే మంచిది.ఉదయం పూట అల్పాహారంలో భాగంగా మొలకెత్తిన విత్తనాలను తినడం కూడా ఎంతో మంచిది.

మొలికెత్తిన విత్తనాలను, పండ్లను, ఖర్జూర పండ్లను ఉదయం పూట తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.వీటిని తీసుకోవడం వల్ల సహజ సిద్ధంగానే మన శరీరంలో రక్షణ వ్యవస్థ బలపడే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube