ఉపాసన.తెలుగు రాష్ట్రాలలో మంచి మనసున్న వ్యక్తిగా పేరు సంపాదించుకుంది.
మెగా వారి కోడలైన ఉపాసన ఎక్కువగా తన సొంత గుర్తింపు తోనే తెలుగు రాష్ట్రాలలో పరిచయం పెంచుకుంది.టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ మంచి హోదాలో ఉన్న సమయంలో అపోలో చైర్మన్ గా బాధ్యతలు చేపడుతున్న ఉపాసనను ప్రేమించి ఆ తర్వాత పెద్దల సమక్షంలో ఘనంగా ప్రేమ వివాహం చేసుకున్నాడు.
ఇక పెళ్లి తర్వాత ఈ జంట టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా నిలిచింది.ఉపాసన చూడటానికి అంత అందగత్తె కాకపోయినా కూడా మంచి మనసున్న అందగత్తె అని చెప్పవచ్చు.
చాలావరకు ఆమె వ్యక్తిగతంగా మంచి పేరు సంపాదించుకుంది.మెగాస్టార్ చిరంజీవికి ఉపాసన విషయంలో ఆయనకు తగ్గట్టుగా కోడలు వచ్చిందని మెగా అభిమానులు చాలా మురిసిపోయారు.
ఉపాసన, రామ్ చరణ్ పెళ్లి పదేళ్లు అవ్వగా ఆ గ్యాప్ లో మెగా వారసుడి కోసం మెగా అభిమానులు చాలా ఎదురు చూశారు.మొత్తానికి ఇటీవలే ఉపాసన మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించింది.
త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించి అందర్నీ సంతోష పెట్టింది ఉపాసన.ఇప్పటివరకు సిని ఇండస్ట్రీలో ఈమె అడుగు పెట్టనప్పటికీ కూడా ఈమెకు మాత్రం రామ్ చరణ్ ద్వారా కొంత వరకు అభిమానం వస్తే.
అపోలో చైర్మన్ గా మాత్రం మరింత పరిచయాన్ని పెంచుకుంది.ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ చాలా వరకు మంచి మంచి విషయాలను షేర్ చేస్తుంది.
ఎక్కువగా హెల్త్ టిప్స్ ను పంచుకుంటుంది ఉపాసన.
చాలావరకు ఉపాసనకు చాలా ఓపిక అని చెప్పవచ్చు.
ప్రతి విషయంలో ప్రజలను దృష్టిలో పెట్టుకొని వారికి ఏదో రకంగా సేవ చేయాలన్న ఆలోచనలు ఉంటుంది.కోవిడ్ సమయంలో కూడా తన వంతు సహాయంతో ముందుకు వచ్చింది ఉపాసన.
అప్పుడప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.తన భర్త రామ్ చరణ్ తో కలిసి ట్రిప్స్ కు వెళ్లిన ఫోటోలను బాగా పంచుకుంటుంది.
ఉపాసన చూడటానికి అంతగా గ్లామర్ షో చేసినట్లు ఎప్పుడు కనిపించదు.తను ధరించిన దుస్తులలో కూడా అంత గ్లామర్ షో కనిపించినట్లు ఉండదు.
ఈ విధంగా కూడా ఉపాసన అందరి దృష్టిలో పడింది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తను తన ఇన్ స్టా లో రామ్ చరణ్ తో దిగిన ఫోటోలను పంచుకుంది.
అందులో తమతో పాటు తాము పెంచుకునే డాగ్ కూడా ఉంది.ఇక ఆ ఫోటో చాలా క్యూట్ గా ఉండగా ఆ ఫోటోని చూసి మెగా అభిమానులు బాగా లైక్స్ కొడుతున్నారు.కామెంట్లు కూడా పెడుతున్నారు.ఇక రామ్ చరణ్ అభిమాని మాత్రం.వదినమ్మ ఎవరి దిష్టి తగలకుండా అన్నయ్యను దాచేయ్.అసలే అందరి కళ్ళు అన్నయ్య మీదే ఉన్నాయి అంటూ కామెంట్ పెట్టడంతో ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.