సాధారణంగా కొందరి ముఖం ఎంత తెల్లగా, మృదువుగా, అందంగా ఉన్నా.చేతులు మాత్రం నల్లగా, రఫ్‌గా కనిపిస్తుంటాయి.
ఎండల ప్రభావం, మృత కణాలు పేరుకుపోవడం, చేతుల సంరక్షణ లేకపోవడం ఇలా రకరకాల కారణాల వల్ల చేతులు డార్క్‌గా మారుతుంటాయి.దాంతో చేతులను తెల్లగా మార్చుకునేందుకు రకరకాల లోషన్లు, మాయిశ్చరైజర్లు ఉపయోగిస్తుంటారు.
అయినా ఫలితం లేకుండా బ్యూటీ పార్లర్స్‌కు వెళ్లి ఏవేవో ట్రీట్మెంట్స్ చేయించుకుంటారు.

కానీ, ఎలాంటి ఖర్చు లేకుండా బీట్రూట్ పౌడర్‌తో చాలా సులభంగా చేతులను తెల్లగా మెరిపించుకోవచ్చు.అసలు ఇంటకీ బీట్రూట్ పౌడర్ ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేయాలి…? ఆ పౌడర్‌ను చర్మానికి ఎలా యూజ్ చేయాలి.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా పీల్ తీసేసిన ఒక బీట్ రూట్ తీసుకుని మెత్తగా గ్రౌండ్ చేసి రసం తీసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్లో బీట్రూట్ రసం వేసుకుని బాగా హీట్ చేసి.గోరువెచ్చగా అవ్వనివ్వాలి.అప్పై హిట్ చేసిన బీట్ రూట్ రసంలో ఒక కప్పు బియ్యం పిండిని కలిపి ఒక గంట పాటు ఎండ బెట్టుకోవాలి.అనంతరం జల్లించుకుంటే బీట్రూట్ పౌడర్ సిద్ధమైనట్టే.
ఇక ఈ పౌడర్‌ను ఎలా వాడాలో కూడా చూసేయండి.మొదట ఒక గిన్నెలో రెండు స్పూన్ల బీట్రూట్ పౌడర్, ఒక స్పూన్ పటిక బెల్లం పొడి మరియు వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసి.ఐదు లేదా ఆరు నిమిషాల పాటు స్మూత్‌గా స్క్రబ్ చేసుకోవాలి.అనంతరం కాస్త డ్రై అవ్వనిచ్చి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా వారంలో రెండు, మూడు సార్లు చేస్తే ఖచ్చితంగా మీ డార్క్ హ్యాండ్స్ వైట్‌గా, బ్రైట్‌గా మెరుస్తాయి.

అలాగే గిన్నెలో రెండు స్పూన్ల బీట్రూట్ పౌడర్, రెండు స్పూన్లు కీరా జ్యూస్ మరియు ఒక స్పూన్ లెమెన్ జ్యూస్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని చేతులకు పట్టి లైట్‌గా ఆరిన తర్వాత మెల్ల మెల్లగా రుద్దుకుంటూ వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేసినా నల్లని చేతులు తెల్లగా మెరుస్తాయి.