ఆది సాయికుమార్ 'క్రేజీ ఫెలో' టీజర్ రిలీజ్, అక్టోబర్ 14న సినిమా విడుదల

మంచి స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకుంటూ, విభిన్నమైన సినిమాలు రూపొందించే నిర్మాత కె.కె.

 Aadi Saikumar Crazy Fellow Teaser Released Details, Aadi Saikumar, Digangana Su-TeluguStop.com

రాధామోహన్‌. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ క్రేజీ ఫెలో.

ఈ చిత్రం టీజర్ ఈరోజు విడుదలైంది.‘క్రేజీ ఫెలో’ టైటిల్ కి తగ్గట్టే టీజర్ లో హీరో ఆది పాత్రని చాలా క్రేజీగా వుంది.ఆది హ్యాపీ లైఫ్ అని గడుపుతుంటాడు.అతను చేసే పనులు తనకు కావాల్సిన వారికి ఇబ్బందులను కలిగిస్తాయి.అతను కుటుంబానికి భారం.స్నేహితులకు, అమ్మాయిలకు ట్రబుల్ మేకర్.

అతని జీవితంలోకి ఇద్దరు అమ్మాయిలు – దిగంగనా సూర్యవంశీ, మర్నా మీనన్ వస్తారు.క్రేజీ ఫెలోగా ఆది క్యారెక్టర్ సినిమాకు యూఎస్‌పీగా ఉండబోతోంది.

ఆది స్టైలిష్ , డైనమిక్ లుక్‌తో పాటు అతని కామిక్ టైమింగ్ ఎక్సటార్డినరీగా వుంది.సతీష్ ముత్యాల కెమెరా పనితనం ఆకట్టుకుంది.ఆర్ఆర్ ధృవన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బ్రిలియంట్ గా వుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ లావిష్ గా ఉన్నాయి.

ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండగా, టీజర్ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది.

సత్య గిడుతూరి ఎడిటర్ గా, కొలికపోగు రమేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, రామ కృష్ణ స్టంట్ మాస్టర్స్ గా పని చేస్తున్నారు.

ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.అలాగే చిత్ర బృందం దూకుడుగా సినిమాను ప్రమోట్ చేస్తోంది.అక్టోబర్ 14న సినిమాను విడుదల చేస్తున్నట్లు టీజర్ ద్వారా ప్రకటించారు నిర్మాతలు.

తారాగణం:

ఆది సాయికుమార్, దిగంగన సూర్యవంశి, మర్నా మీనన్.

సాంకేతిక విభాగం:

సమర్పణ: లక్ష్మీ రాధామోహన్, బ్యానర్ : శ్రీ సత్య సాయి ఆర్ట్స్, నిర్మాత : కేకే రాధమోహన్, రచన, దర్శకత్వం: ఫణికృష్ణ సిరికి, సంగీతం : ఆర్ఆర్ ద్రువన్, డీవోపీ: సతీష్ ముత్యాల, ఆర్ట్ : కొలికపోగు రమేష్, ఎడిటర్: సత్య గిడుతూరి, యాక్షన్: రామ కృష్ణ, కొరియోగ్రఫీ: జిత్తు, హరీష్, ప్రొడక్షన్ కంట్రోలర్: యంఎస్ కుమార్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం శ్రీనివాసరావు (గడ్డం శ్రీను), పీఆర్వో: వంశీ-శేఖర్, డిజైనర్ : రమేష్ కొత్తపల్లి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube