గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా జి కె ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై గౌతమ్ కృష్ణను దర్శకుడిగా తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ”ఆకాశ వీధుల్లో”.మనోజ్ డి జె, డా.మణికంఠ చిత్రాన్ని నిర్మించారు .సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.చిత్ర బృందంతో పాటు సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ , నిర్మాత సతీష్ , గోపి ఆచంట, రామ సత్య నారాయణ, ప్రసన్న కుమార్ , దామోదర్ ప్రసాద్, దర్శకుడు నరేంద్రనాథ్, జూనియర్ పవన్ కళ్యాణ్ తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.
గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.
”ఆకాశ వీధుల్లో” పక్కా యూత్ ఫుల్ డ్రామా.కేవలం యువత కోసం తీసిన సినిమా ఇది.యూత్ ఈ సినిమా చూడండి.తప్పకుండా కనెక్ట్ అవుతారు.
ఈ సినిమా ఒక స్లో పాయిజన్.ఈ సినిమా చూసిన తర్వాత మీకు నచ్చకపోతే నన్ను నేరుగా విమర్శించండి.
ఈ సినిమాపై నాకు చాలా నమ్మకం వుంది.ఈ సినిమా రిటన్ బై రియాలిటీ.
నిజ జీవితం నుండి పుట్టిన కథ.డైరెక్టర్ బై ప్యాషన్.ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి యంగ్ స్టార్ బ్లడ్ బాయిల్ అవుద్ది.చాలా స్ఫూర్తిని పొందుతారని నమ్ముతున్నా.విమర్శకుల కోసం తీసిన సినిమా కాదిది.ఈ సినిమా తీసింది ప్రేక్షకులు, యూత్ కోసం.
ఈసినిమా క్లాస్ పీకినట్లు వుండదు.ఒక కామన్ బాయ్ రాక్ స్టార్ ఎలా అయ్యాడనేది ఇందులో కథ.లైఫ్ లో మీరు కోల్పోయిన ఆనందాన్ని ఈ సినిమా ఖచ్చితంగా మీకు తిరిగిఇస్తుందని నమ్ముతున్నా.సినిమా చేయాలని ఇంట్లో ఒక్క ఛాన్స్ అడిగా.
నాపై నమ్మకంతో సరే అన్నారు.నాకు ఎలాంటి సినిమా నేపధ్యం లేదు.
ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం.ప్రతి సినిమాకి వుండే కష్టమే.
ప్రేక్షకులకు కావాల్సింది కంటెంట్.ఈ సినిమా కంటెంట్ యంగ్ స్టార్స్ కి చాలా నచ్చుతుంది.థియేటర్ బ్లాస్ట్ కాకపొతే నన్ను అడగండి.”ఆకాశ వీధుల్లో’ సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున థియేటర్ లోకి వస్తోంది.నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ ని.పవర్ స్టార్ ఫాన్స్ నుండి కూడా మాకు చాలా సపోర్ట్ దొరుకుతుంది.ఈ ఈవెంట్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.14 ఏళ్ల కుర్రాళ్ళ నుండి 40 ఏళ్ల యంగ్ స్టర్స్ వరకూ అలాగే వయసుతో నిమిత్తం లేకుండా మనసులో యవ్వనం వుండే అరవై ఏళ్ళ వ్యక్తులకు కూడ ఈ సినిమా నచ్చుతుంది.ఈ సినిమాని మార్నింగ్ షో చూడండి.నచ్చితే మీ ఫ్యామిలీని తీసుకెళ్ళండి.వాళ్ళు కూడా మీకు ఫ్రండ్ గా మారుతారు.ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూసి మంచి హిట్ ఇవ్వాలి” అని కోరారు.
ఆర్ పి పట్నాయక్ మాట్లాడుతూ.
గౌతమ్ కృష్ణ ఫ్యామిలీని చూస్తుంటే నా ఫ్యామిలీ గుర్తుకు వచ్చింది.ఆ నాడు మా నాన్న, అన్నయ్య ఇచ్చిన సపోర్ట్ కారణంగానే నేను ఈ వేదికపై నిలబడ్డాడు.ఇప్పుడు గౌతమ్ లో నన్ను నేను చూసుకున్నాను.
ఆల్ ది బెస్ట్ గౌతమ్.వెల్ కమ్ టు ది ఇండస్ట్రీ.
ఈ సినిమా హిట్ అవుతుందని చెప్పడానికి రెండు విషయాలు కనిపిస్తున్నాయి.ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే అర్జున్ రెడ్డి గుర్తుకు వచ్చింది.
అర్జున్ రెడ్డిలానే ఈ సినిమా కూడా యూత్ కి కనెక్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా వున్నాయి.మరో కారణం.
ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది.ఈ సినిమా పాటలకు మిలియన్ వ్యూస్ వున్నాయి.
అంటే.ఈ సినిమా కోసం అంతమంది ఎదురుచూస్తున్నారు.
పూజిత మన తెలుగు అమ్మాయి.తనకి ఈ సినిమాతో మంచి పేరు రావాలి.
ఈ సినిమా సాంకేతిక నిపుణులు, నటీనటులందరికీ ఆల్ ది బెస్ట్.ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి” అని కోరారు.
పూజిత పొన్నాడ మాట్లాడుతూ.
నేను ఇండస్ట్రీకి వచ్చిన నాలుగేళ్ళు అవుతుంది.ఇరవై సినిమాలు చేశాను.అయితే ఒక మంచి సినిమా చేశాననే తృప్తిని ఇచ్చిన చిత్రమిది.ఈ సినిమా నాకు చాలా స్పెషల్.గౌతమ్ కృష్ణ చాలా బ్రిలియంట్ గా తీశారు.
అలాగే ఆయనతో కలసి నటించడం కూడా మంచి అనుభవం.ఈ సినిమాని చాలా గ్రాండ్ గా తీశాం.
జూడా శాండీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని తెరకెక్కించారు.
ఈ సినిమా కంటెంట్ అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది.సెప్టెంబర్ 2 న సినిమా వస్తోంది.
అందరూ చూడండి.మీ అందరికీ ప్రోత్సాహం కావాలి” అని కోరారు.
సతీష్ మాట్లాడుతూ.
గౌతమ్ కృష్ణ నాకు మంచి స్నేహితుడు.బట్టల రామస్వామి బయోపిక్ జరుపుతున్నపుడు నాకు పరిచయం.ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత పాండమిక్ వలన కొంత ఆలస్యమైయింది.ఈ గ్యాప్ లో సినిమాని గురించి ఎక్కువగా చర్చించుకునేవాళ్ళం.ఈ సినిమాని ఎక్కడా రాజీపడకుండా నిర్మించిన గౌతమ్ ఫ్యామిలీకి అభినందనలు.
ఈ సినిమా చూశాను.ఎక్స టార్డీనరీగా వుంది.
ఈ చిత్రానికి గౌతమ్ దర్శకుడని తెలిసి సర్ప్రైజ్ అయ్యాను.చాలా బ్రిలియంట్ గా తీశాడు.
యూత్ కి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.మంచి టెక్నికల్ వాల్యూస్ వున్నాయి.
చిన్న సినిమా.పెద్ద సినిమా అనే తేడా లేదు.
ఇప్పుడు ఈక్వేషన్ మారిపోయింది.మంచి కంటెంట్ వున్న సినిమా ఆడితే అదే పెద్ద సినిమా అవుతుంది.
ట్రెండ్ మారిపోయింది.దానికి తగ్గట్టు ఈ సినిమాని తీశాడు గౌతమ్.ఈ సినిమా అందరికీ మంచి పేరు, నిర్మాతలు డబ్బులు తీసుకొచ్చి, గౌతమ్ కి మంచి భవిష్యత్ వుండాలి” అని కోరారు.
నిర్మాత మనోజ్ మాట్లాడుతూ.
సినిమా అద్భుతంగా వచ్చింది.చాలా ఆనందంగా వుంది.
గౌతమ్ కృష్ణ చాలా తెలివైనవాడు.సినిమాలు అంటే చాలా ఇష్టం.
ఎంబీబీఎస్ లో ఉండగానే సినిమా చేస్తానని చెప్పాడు.అయితే ముందు మెడిషన్ పూర్తి చేయమని చెప్పాను.
పీజీ కూడా పూర్తయ్యేది.కానీ సినిమాలపై ఇష్టంతో ఈ రంగంలో వచ్చాడు.
మా పెద్దబ్బాయి జగదీశ్ మణికంఠ ఈ సినిమా కోసం చాలా ప్రోత్సహించాడు.గౌతమ్ ని ప్రతిభని నమ్మాడు.
అలాగే మా తమ్ముడు రాజు కూడా సపోర్ట్ చేశాడు.సినిమా చూశాను.
చాలా బావుంది.గౌతమ్ కి అభినందనలు.
చాలా అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేశాడు.ఈ సినిమా విడుదలకు సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా ఆడుతుంది” అన్నారు
జూనియర్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.
”ఆకాశ వీధుల్లో’ సినిమా పేరుకు తగ్గట్టు ఆకాశాని మించి వెళుతుంది.చాలా అనుభవం వున్న దర్శకుడిలా గౌతమ్ కృష్ణ ఈ సినిమా తీశారు.పూజిత అద్భుతమైన నటి.చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్.సెప్టెంబర్ 2 న విడుదలౌతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు సూపర్ హిట్ చేయాలి’ అని కోరారు.
నరేంద్రనాథ్ మాట్లాడుతూ.
నటుడిగా దర్శకుడిగా రచయిత ఈ సినిమా కోసం కష్టపడ్డ గౌతమ్ కృష్ణకి అభినందనలు.ట్రైలర్ చాలా ఎక్సయింటింగా వుంది.గౌతమ్ కృష్ణ రాక్ స్టార్ జర్నీ చాలా క్యురియాసిటీని పెంచింది.పూజిత పొన్నాడతో పాటు మిగతా నటీనటులు సాంకేతిక నిపుణలకు, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్.సినిమా మంచి విజయం సాధించాలి” అని కోరారు.
దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.
ఇండిపెండెంట్ ఫిలిం మేకింగ్ చాలా సవాల్ తో కూడుకున్నది.అయితే ఇండిపెండెంట్ చిత్రాలే అద్భుత విజయాలు సాధిస్తుంటాయి.చాలా సమయంలో పరిశ్రమకి ఊతనిచ్చేవి చిన్న, ఇండిపెండెంట్ చిత్రాలే.గౌతమ్ కి ఫ్యామిలీ సపోర్ట్ వుండటం చాలా ఆనందంగా వుంది.గౌతం కృష్ణ తను అనుకున్నది చేశారు.
అసలైన ప్రయాణం ఇక్కడి నుండే మొదలౌతుంది.చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్” తెలిపారు
గోపి ఆచంట మాట్లాడుతూ.
తొలి సినిమాతోనే నటనతో పాటు దర్సకుడిగా రచయితగా గౌతమ్ కృష్ణ పరిచయం కావడం అరుదైన విషయం.గౌతమ్ కి వారి కుటుంబం సపోర్ట్ గా ఉంటడం చాలా అభినందించదగ్గా అంశం.
ఈ సినిమా కోసం గౌతమ్ కృష్ణ అన్ని విభాగాల్లో కష్టపడ్డారు.ఈ సినిమా విజయం సాధిస్తే ఆ క్రెడిట్ ఆయనకే దక్కతుంది.ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను.
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.
”ఆకాశ వీధుల్లో’ ఒక ఫ్యామిలీ ప్రాజెక్ట్ లా చేశారు.కొడుకు ఏం కోరితే అది సమకూర్చే తండ్రిగా గౌతమ్ కృష్ణ గారి తండ్రిని చూశాను.
అలాగే గౌతం అన్నగారు కూడా చాలా సపోర్ట్ గా వున్నారు.ఒక నటుడిగా దర్శకుడిగా రచయిత నిర్మాతగా ఎక్కడా రాజీపడలేదు గౌతమ్ కృష్ణ.
ఫ్యామిలీ సపోర్ట్ వుండటం గౌతమ్ అదృష్టం.చిన్నా పెద్దా అని కాకుండా కంటెంట్ వున్న చిత్రాలని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
చిన్న సినిమాలతో పెద్ద స్టార్లు వచ్చిన ఇండస్ట్రీ ఇది.ఈ సినిమా కూడా గౌతమ్ కృష్ణకి మంచి విజయం ఇవ్వాలి” అని కోరారు.
రామ సత్య నారాయణ మాట్లాడుతూ.
.డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని కామన్ గా చెబుతుంటారు.ఐతే గౌతమ్ కృష్ణ డాక్టర్ అయిన తర్వాత యాక్టర్ అయ్యారు.అలాగే దర్శకుడిగా కూడా మారారు.మంచి, కథనం రాసుకొని ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఒక విజయం.
ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది.మంచి మ్యూజిక్ వుంది.
ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమా తీశారు.పూజిత పొన్నాడ తో పాటు మిగతా నటీనటులు చక్కని నటన కనబరిచారు.
రెండో తేదిన విడుదలయ్యే సినిమాల్లో ఈ చిత్రం ఒకటి రెండు స్థానంలో వుండాలి” అని కోరుకున్నారు.