బ్రేక్‌ఫాస్ట్ లో బ్రెడ్ తింటున్నారా.. అయితే మీ ఆరోగ్యం ఖతం!
TeluguStop.com
ప్రస్తుత రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరిది ఉరుకుల పరుగుల జీవితం గా మారిపోయింది.
కుటుంబ పోషణ మరియు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడం కోసం డబ్బు సంపాదనలో పడిపోతున్నారు.
కనీసం తినడానికి కూడా టైం లేనంత బిజీ అవుతున్నారు.ముఖ్యంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ ను( Bread ) తీసుకోవడం మనలో ఎంతోమందికి ఉన్న కామన్ అలవాటు.
టిఫిన్ చేసుకునేంత సమయం లేకపోవడంతో బ్రెడ్ కు జాబ్ లేదా పీనట్ బటర్ పూసుకుని తినేయడం కడుపు నింపుకోవడం చేస్తుంటారు.
కానీ ఇలా తరచూ బ్రేక్ ఫాస్ట్ లో( Breakfast ) బ్రెడ్ తీసుకోవడం సరైన ఎంపిక కాదని నిపుణులు చెబుతున్నారు.
బ్రెడ్ ను అధికంగా తినడం వల్ల ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.
"""/" /
తరచూ బ్రెడ్ ను తినడం వల్ల అనేక దుష్ప్రభావాలు తలెత్తుతాయి.
అందులో ముఖ్యమైనది మధుమేహం.( Diabetes ) బ్రెడ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది.
ఇది రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగడానికి కారణమవుతాయి.మరియు మధుమేహం వచ్చే రిస్క్ ను పెంచుతాయి.
అలాగే నిత్యం బ్రెడ్ తినేవారు భారీగా బరువు పెరుగుతారు.బ్రెడ్ లోని అధిక కార్బ్ కంటెంట్ ఆకలిని పెంచుతుంది.
దాంతో ఏది పడితే అది తినేస్తుంటారు.ఫలితంగా వెయిట్ గెయిన్( Weight Gain ) అవుతారు.
"""/" /
వైట్ బ్రెడ్( White Bread ) ఎక్కువగా ప్రాసెస్ చేయబడుతుంది.
ప్రాసెసింగ్ సమయంలో శుద్ధి చేసిన గోధుమ పిండి దాని సహజ పోషకాలను కోల్పోతుంది.
పైగా బ్రెడ్‌ను ఎక్కువ కాలం నిల్వ ఉంచడం కోసం పొటాషియం బ్రోమేట్ వంటి హానికరమైన రసాయనాలను వాడతారు.
అటువంటి బ్రెడ్ ను మనం తరచూ తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతంది.
అంతేకాదు బ్రెడ్‌లో ఉపయోగించే ఎమల్సిఫైయర్‌లు గట్ మైక్రోబయోమ్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.దీని వల్ల జీర్ణ అసౌకర్యం మరియు గట్ అవరోధం వంటి సమస్యలు తలెత్తాయి.
నిత్యం బ్రెడ్ తినడం వల్ల ఉబ్బరం, మలబద్ధకం మరియు యాసిడ్ రిఫ్లక్స్ వంటి కడుపు సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి.
కాబట్టి ఇకనైనా బ్రెడ్ పై ఆధార పడటం మానేసి బ్రేక్ ఫాస్ట్ లో మంచి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోండి.
జుట్టు దట్టంగా పెరగాలా.. అయితే ఈ ఆయిల్ ను వాడండి!