నందమూరి నటసింహం బాలకృష్ణ( Blakrishna ) కెరీర్ లో 109వ సినిమాను ఈ మధ్యనే అఫిషియల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే.యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను బాలయ్య పుట్టినరోజు నాడు అఫిషియల్ గా లాంచ్ చేసారు.
దీంతో ఈ సినిమాపై కూడా అంచనాలు అమాంతం పెరిగి పోయాయి.ఇటీవలే మెగాస్టార్ తో వాల్తేరు వీరయ్య( Waltair Veerayya ) వంటి సక్సెస్ కొట్టిన ఈ యంగ్ డైరెక్టర్ బాలయ్యతో కూడా పవర్ ఫుల్ సబ్జెక్ట్ తీసి హిట్ అందుకోవాలని ఆతృతగా ఉన్నాడు.
ఈ సినిమా గురించి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమా షూట్ గురించి తెలుస్తుంది.
మొదటి షెడ్యూల్ ను హైదరాబాద్ లోని సారధి స్టూడియోస్ లో స్టార్ట్ చేయనున్నారని తెలుస్తుంది.
ఈ ఫస్ట్ షెడ్యూల్ లో ముందుగా భారీ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేస్తారట.ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం సెటప్ మొత్తం రెడీ చేస్తున్నారని టాక్.ఈ సెటప్ మొత్తం రెండు వారాల్లో పూర్తి అవుతుందని.
ఆ తర్వాత ఆ సెట్ లో షూట్ స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నాడని తండ్రి కొడుకులుగా బాలయ్య నటిస్తాడని.
తండ్రిగా బాలయ్య గెటప్ అదిరిపోనుందని ఇప్పటికే పలు వార్తలు వైరల్ అయ్యాయి.
మరి బాబీ( Bobby ) వింటేజ్ బాలయ్యను ఎలా చూపిస్తాడో వేచి చూడాలి.ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఫార్చ్యూన్ 4 ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా నిర్మాతలుగా నాగ వంశీ, త్రివిక్రమ్ భార్య సౌజన్య వ్యవహరించ బోతున్నారు.థమన్ సంగీతం అందించబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.