సిగరెట్టుతో స్టేజ్ పైకి వచ్చిన సల్మాన్ ఖాన్... ఫైర్ అవుతున్న నెటిజన్స్!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమానికి ఈయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం హిందీలో ఈ కార్యక్రమం ఓటీటీ రెండవ సీజన్ ప్రసారమవుతుంది.

 Netizens Fire On Salman Khan Due To Bigg Boss Ott 2 Details, Salman Khan, Bollyw-TeluguStop.com

ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి నేటిజన్స్ నుంచి ఏదో విధంగా విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు.ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా పాల్గొన్నటువంటి జైద్ హదీద్ తన తోటి కంటెస్టెంట్ ఆకాంక్ష పూరితో అసభ్యకరంగా ప్రవర్తించడం వివాదంగా మారింది.

Telugu Bigg Boss, Bigg Boss Ott, Bollywood, Cigarette, Hindi Bigg Boss, Salman K

ఇకపోతే వీరిద్దరూ లిప్ లాక్ పెట్టుకోవడంతో తీవ్రస్థాయిలో నేటిజన్స్ విమర్శలు కురిపించారు.ఇలాంటి కార్యక్రమాలను ప్రసారం చేస్తూ ప్రజలకు ఎలాంటి సందేశాలు పంపించాలి అనుకుంటున్నారు అంటూ మండిపడ్డారు.ఇలా కంటెస్టెంట్లు వ్యవహరించిన తీరుపై సల్మాన్ ఖాన్ సైతం ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే జులై 8వ తేదీ ప్రసారమైనటువంటి కార్యక్రమంలో భాగంగా సల్మాన్ ఖాన్ వేదిక పైకి వచ్చి హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లతో ముచ్చటించారు.

అయితే ఈ కార్యక్రమంలో భాగంగా సల్మాన్ ఖాన్ చేతిలో సిగరెట్ పట్టుకుని రావడం ప్రస్తుతం వివాదంగా మారింది.

Telugu Bigg Boss, Bigg Boss Ott, Bollywood, Cigarette, Hindi Bigg Boss, Salman K

ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు సల్మాన్ ఖాన్ వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.ఇలా సిగరెట్టుతో (Cigarette) స్టేజ్ పైకి రావడంతో ఈ ఫోటో చూసిన నెటిజెన్స్.కంటెస్టెంట్స్ తప్పొప్పులు చూపే ముందు, మీరు చేస్తున్న తప్పులను గమనించి మీరు మారండి అంటూ సల్మాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

ఒక సెలబ్రిటీ స్టేజిలో ఉన్న వ్యక్తే ఇలా పబ్లిక్ గా సిగరెట్‌ కాల్చి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలని చూస్తున్నారు అంటూ మరికొంతమంది మండిపడుతున్నారు.మరి సల్మాన్ ఖాన్ గురించి వస్తున్నటువంటి ఈ విమర్శలపై ఆయన ఎలా రియాక్ట్ అవుతూ సమాధానం చెబుతారో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube