యూపీఎస్సీ పరీక్షలో సివిల్స్ ర్యాంక్( Civils Rank ) సాధించడం కోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.ఎంత కష్టపడినా కొన్నిసార్లు అనుకున్న లక్ష్యాన్ని సులువుగా సాధించడం సాధ్యం కాదు.
ఎన్నో ఓటములను ఎదుర్కొని కష్టపడితే చివరకు అనుకున్న ఫలితం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.అయితే అహింసా జైన్( Ahinsa Jain ) అనే యువతి యూపీఎస్సీ సాధించడం కోసం ఎంతో కష్టపడగా మెజారిటీ సందర్భాల్లో ఆశించిన ఫలితం రాలేదు.
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అహింసా జైన్ ప్రైవేట్ జాబ్ సాధించినా ఆ ఉద్యోగాన్ని వదిలేసి మరీ యూపీఎస్సీ( UPSC ) కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టారు.ఐదుసార్లు ఆశించిన ఫలితం రాకపోయినా వెనుకడుగు వేయకుండా 2020 సంవత్సరంలో ఆరో ప్రయత్నంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించి ప్రశంసలు అందుకుంటున్నారు.2020 సంవత్సరంలో అహింసా జైన్ 53వ ర్యాంక్ సాధించారు.

ఇంటర్వ్యూలలో చాలాసార్లు ఆశించిన ఫలితాన్ని అందుకోని అహింసా జైన్ చివరకు ఐఏఎస్( IAS ) సాధించడం సంతోషంగా ఉందని చెబుతున్నారు.నిద్ర విషయంలో, అలవాట్ల విషయంలో రాజీ పడితే మాత్రమే సక్సెస్ సొంతమవుతుందని ఆమె కామెంట్లు చేశారు.నా విజయంలో దేవునికి క్రెడిట్ ఇస్తున్నానని అహింసా జైన్ వెల్లడించారు.
ఇంటర్వ్యూలో అహింసా జైన్ అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం ఆమెకు ప్లస్ అయింది.

ప్రజా సేవ చేయాలని భావించి ఐఏఎస్ ను ఎంచుకున్న అహింసా జైన్ ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నారు.రాబోయే రోజుల్లో అహింసా జైన్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.అహింసా జైన్ సక్సెస్ స్టోరీ( Ahinsa Jain Success Story ) నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
అహింసా జైన్ తన టాలెంట్ తో ఈ స్థాయికి చేరుకోవడంతో పాటు ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.కష్టపడితే ఏదో ఒకరోజు సక్సెస్ దక్కుతుందని అహింసా జైన్ సక్సెస్ స్టోరీతో ప్రూవ్ అయింది.







