అయ్యప్ప హరివరాసనం పాట ఎలా పుట్టిందంటే..?
TeluguStop.com
శబరిమల( Sabarimala ), ఈ పేరు చెప్తేనే చాలామంది భక్తులు భక్తి భావంతో పొంగిపోతారు.
ఇక కార్తీకమాసం వచ్చిందంటే చాలు అందరూ అయ్యప్ప దీక్షపరులతో, అయ్యప్ప నామస్మరణతో మారుమోగిపోతూ ఉంటాయి.
అయ్యప్పను చాలామంది ఎంతో ఇష్టంగా కొలుస్తారు.ఎంతో మంది దేవుళ్ళు ఉన్నా కూడా అయ్యప్ప స్వామికి ఓ ప్రత్యేకత ఉంది.
అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు.అయితే ఈ స్వామికి ప్రత్యేకమైన పాట కూడా ఉంది.
అయితే ఆ ప్రత్యేకమైన పాట ఏమిటంటే పవళింపు పాట.అయ్యప్ప స్వామి హరివరాసనం పాట సీనియర్ గాయకుడు ఏసుదాసు( Yesudas ) పాడారు.
అయ్యప్ప స్వామికి పవళింపుగా ఈ పాటను ఆలపిస్తారు. """/" / అయితే ఈ పాట ఎంత విన్నా కూడా తనివి తీరదు.
శబరిమల మణికంఠుని సన్నిదానంలో అయితే తన్మయత్వంలో పులకించుకోక తప్పదు.ఇక ఈ పాట ఎలా పుట్టింది? ఎవరు రచించారు? మొదటగా ఎవరు పాడారు? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
శబరిమలలో హరివరాసనం పాడుతున్న సమయంలో ఎలాంటి వాతావరణం ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.
అయ్యప్ప పూజలు చేసిన తర్వాత చివరగా ఈ పాటను పాడడం ఒక సంప్రదాయంగా వస్తుంది.
ఇదే విధానాన్ని ఇతర అయ్యప్ప ఆలయాల్లోనూ, ఇతర పూజ కార్యక్రమాల్లో, ఉత్సవాల్లో కూడా ఆలపిస్తారు.
ఈ అయ్యప్పస్వామి పవళింపు స్తోత్రాన్ని కుంభకుడి కులత్తూర్ అయ్యర్( Kumbakudi Kulattur Ayyar ) రచించడం జరిగింది.
"""/" /
అయితే 1955లో స్వామి విమోచనానంద అయ్యర్ ఈ స్తోత్రాన్ని శబరిమలలో ఆలపించారు.
ఇక 1940-55 దశకాల్లో శబరిమలలోని నిర్మానుష కాలంలో విఆర్ గోపాలమీనన్ అనే భక్తుడు స్వామి వారి ఆలయ సమీపంలో జీవిస్తూ ఉండేవాడట.
స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు చేస్తూ ఈ హరివరాసనాన్ని పఠిస్తూ ఉండేవారట.అప్పట్లో ఈశ్వర్ నంభుత్రి అనే తాంత్రి స్వామి వారికి పూజలు చేస్తూ ఉండేవారు.
ఆ తర్వాత గోపాలమీనన్ శబరిమల నుండి వెళ్లిపోయాక అతను మరణించాడు అనీ తెలుసుకొని, తీవ్రంగా బాధపడి, దుఃఖించిన ఈశ్వర్ నంభుత్రి తాంత్రి ఆ రోజు ఆలయం మూసే సమయంలో హరివరాసనం స్తోత్రం చదివేవారట.
ఇక అప్పటినుండి శబరిమలలో ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.
తారక్ తో డ్యాన్స్ నాకో ఛాలెంజ్.. హృతిక్ రోషన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!