నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది మైగ్రేన్ తలనొప్పితో బాధ పడుతున్నారు.మైగ్రేన్ తలనొప్పినే పార్శ్వపు నొప్పి అని కూడా అంటారు.
ఈ మైగ్రేన్ తలనొప్పిని భరించడం చాలా కష్టం.తలనొప్పి కంటే తీవ్రంగా ఉండే మైగ్రేన్.
ఎందరినో ముప్ప తిప్పలు పెడుతోంది.ఇక మైగ్రేన్ తలనొప్పిని తట్టుకోలేక హాస్పటల్స్ చుట్టూ తిరుగుతూ ఏవేవో మందులు వాడుతుంటారు.
కానీ, అసలు మైగ్రేన్ తలనొప్పికి కారణాలు ఏంటీ ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాయదారి వ్యాధి నుంచి త్వరగా బయట పడవచ్చు ? అన్న వాటిపై శ్రద్ధ చూపరు.
అయితే వాస్తవానికి మైగ్రేన్ తలనొప్పికి చాలా కారణాలు ఉన్నాయి.
తరచూ తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవడం, నిద్రను నిర్లక్ష్యం చేయడం, హార్మోన్ల సమస్యలు, ఎక్కువసేపు ఎండలో ఉండడం, మద్యం అలవాటు, స్మోకింగ్, కెఫిన్ ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, డిప్రెషన్, మానసిక ఆందోళన ఇలా రకరకాల కారణాల వల్ల మైగ్రైన్ వ్యాధి బారిన పడుతుంటారు.

అలాగే కొందరిని వంశపారంపర్యంగా కూడా మైగ్రేన్ సమస్య వస్తుంది.ఇక ఈ మైగ్రేన్ వ్యాధి వచ్చిందంటే తట్టుకోలేనంతగా తలనొప్పి వస్తుంది.ముఖ్యంగా తలకు ఒకవైపు తీవ్రమైన నొప్పి పుడుతుంది.
ఏ పనిని చేయలేకపోతుంటారు.ప్రశాంతంగా ఉండలేరు.
కొందరికి వాంతులు, వికారంగా ఉండటం, కళ్లు తిరగడం, అలసట, ముఖం పాలిపోవడం, చికాకు, కాళ్ళు చేతులు చల్లబడడం ఇలా అనేక లక్షణాలు కనిపిస్తాయి.

ఇలా జరిగితే ఖచ్చితంగా వైద్యులు సంప్రదించాలి.అలాగే మైగ్రేన్‌కు కారణమయ్యే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
పోషకాహారం తీసుకోవడం పాటు ప్రతి రోజు వ్యాయామం, యోగా చేయాలి.తగినంత నిద్రపోవాలి.
ఒత్తిడికి మరియు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.