YSRCP Actor Prudhvi :కడప పెద్ద దర్గా దర్శించుకున్న అనంతరం పృథ్వి సంచలన వ్యాఖ్యలు..!!

ఈరోజు నుండి కడప పెద్ద దర్గా ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి.ఈ సందర్భంగా నటుడు పృద్వి పెద్ద దర్గా దర్శించుకోవడం జరిగింది.

 Actor Prudhvi Sensational Comments On Ysrcp , Actor Prudhvi, Kadapa Dargha, Ysr-TeluguStop.com

అనంతరం మీడియాతో మాట్లాడుతూ… పెద్ద దుర్గా దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.గతంలో అనేకసార్లు రావడం జరిగింది.

ఈసారి “ఏపీ జీరో ఫర్ రామాపురం” చిత్రం కోసం వచ్చినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు.

ఆ భగవంతుడే రాష్ట్రాన్ని కాపాడాలని కోరారు.

రాష్ట్రంలో పరిపాలన ఎప్పుడో  గాడి తప్పిందని విమర్శల వర్షం కురిపించారు.

ఇక వైసీపీ పార్టీలో పద్ధతులు నచ్చక బయటకు వచ్చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు.పార్టీలో ఉన్నంతకాలం చిత్తశుద్ధితో పనిచేసినట్లు పేర్కొన్నారు.

 ఈ క్రమంలో అప్పట్లో వైసీపీ పార్టీలో టీటీడీలో కీలక పదవిలో తనపై ఆరోపణలు చేసిన వారికి నీతి నిజాయితీ ఉంటే… అల్లా సాక్షిగా ఇక్కడికి వచ్చి ప్రమాణం చేయండి అని సవాలు విసిరారు.దీంతో నటుడు పృథ్వి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube