ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ సునీల్ థియోధర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేస్తుందని అన్నారు.
టీడీపీతో పొత్తు పెట్టుకోమని తేల్చి చెప్పారు.గత అనుభవాలను దృష్టిలో పెట్టుకునే టీడీపీతో పొత్తు పెట్టుకోరాదని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
అనంతరం రాష్ట్ర బీజేపీలో సోము వీర్రాజు విఫలమయ్యారంటూ ఆ పార్టీ కీలక నేత కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు.కన్నా వ్యాఖ్యలను తామేమీ అంత సిరీయస్ గా తీసుకోవడం లేదన్నారు.
పార్టీలో ఈ తరహా అసంతృప్తులు సహజమేనని తెలిపారు.







