Baby 2 : వైరల్ అవుతున్న బేబీ2 కథ ఇదే.. విరాజ్ అశ్విన్ కొడుకు వైష్ణవి కూతురును ప్రేమించడంతో?

రీసెంట్గా డైరెక్టర్ సాయి రాజేష్( Sai rajesh ) తెరకెక్కించిన బేబీ సినిమా ఎంతలా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుందో చూసాం.ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కలిసిన నటించిన ఈ సినిమా వారి కెరీర్ కు మలుపు తిప్పిందని చెప్పవచ్చు.

 Fan Made Baby 2 Movie Story Goes Viral In Social Media-TeluguStop.com

ఇప్పటికి కొన్నిచోట్ల ఈ సినిమా నడుస్తూనే ఉంది.లవ్ స్టోరీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు భారీ వసూలు వచ్చాయని చెప్పాలి.

ముఖ్యంగా ఈ సినిమా యువతను బాగా కనెక్ట్ చేసింది.దీంతో ఈ సినిమాకు పడిపోయిన ప్రేక్షకులు ఈ సినిమా సీక్వెల్ తీయమని డైరెక్టర్ సాయి రాజేష్ ను తెగ రిక్వెస్ట్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమా సీక్వెల్ గురించి ఆయన ఇప్పటివరకు ఏ విధంగా స్పందించలేదు కానీ.తాజాగా సోషల్ మీడియాలో బేబీ 2 స్టోరీ ఇదేనంటూ వైరల్ చేస్తున్నారు.

ఇంతకూ స్టోరీ ఏంటంటే.మామూలుగా పార్ట్ వన్ లో వైష్ణవి చేతిలో ఆనంద్, విరాజ్ మోసపోగా వైష్ణవి మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుంది.

Telugu Anand, Sai Rajesh, Story Baby, Viraj Ashwin-Movie

అయితే పార్ట్ 2 లో.వైష్ణవికి( Vaishnavi Chaitanya ) పెళ్లైన 20 సంవత్సరాల తర్వాత ఆమె కూతురు అమెరికాలో ఓ కాలేజీలో చదువుతుంది.దీంతో అక్కడ ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది వైష్ణవి కూతురు.ఇంతకు ఆ అబ్బాయి ఎవరో కాదు విరాజ్ కొడుకు.విరాజ్ అమెరికాలో సెటిల్ అవ్వటంతో తనను మోసం చేసిన వైష్ణవి మీద పగ తీర్చుకోవడానికి ఆమె కూతుర్ని లవ్ చేయమని తన కొడుకుకి చెప్పి పంపిస్తాడు.అయితే విరాజ్ ప్లాన్ ఏంటంటే.

వైష్ణవి కూతురికి తన తల్లి నిజం స్వరూపం చూపించి.ఆ తర్వాత తన కొడుకుతో మోసం చేయించాలనుకుంటాడు.

కానీ విరాజ్ కొడుకు వైష్ణవి కూతుర్ని సిన్సియర్ గా లవ్ చేస్తాడు.అంతేకాకుండా అసలు విషయం కూడా చెప్పేస్తాడు.

దీంతో తనను నిజంగా ప్రేమిస్తే తాము అప్పటికే తీసుకున్న ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయమని అంటుంది వైష్ణవి కూతురు.

Telugu Anand, Sai Rajesh, Story Baby, Viraj Ashwin-Movie

దీంతో విరాజ్ కొడుకు ఏమాత్రం ఆలోచించకుండా ఆ ఫోటోలు డిలీట్ చేస్తాడు.అయితే ఇండియాకు వెళ్లిన తర్వాత వైష్ణవి కూతురు పెళ్లి చేసుకుందామని విరాజ్ కొడుకుకు ఫోన్ చేసి రమ్మని అంటుంది.దాంతో విరాజ్ కొడుకు తండ్రికి నిజం చెప్పకుండా ఇండియాకి వెళ్తాడు.

అయితే ఇండియాకి వచ్చిన తర్వాత విరాజ్ కొడుకు తనని వేధిస్తున్నాడని పోలీసులకు చెప్పి జైలుకు పంపిస్తుంది వైష్ణవి కూతురు.దీంతో విరాజ్( Viraj Ashwin ) కొడుకు.

తన తండ్రిని మోసం చేశానని.ఇలా అమ్మాయి చేతిలో మోసపోయాను అని బాధపడుతూ సూసైడ్ చేసుకుందామని ప్రయత్నించడంతో అప్పుడే ఒక పెద్దాయన వచ్చి ఆపుతాడు.

ఇక ఆ పెద్దాయన ఎవరో కాదు ఆనంద్.ఇక విరాజ్ కొడుకును తన ఆటోలో ఎక్కించుకొని కొన్ని విలువైన మాటలు చెప్పి.

నీకు ఒక ఆటో కొనిస్తాను నువ్వు కూడా ఇక్కడే తిప్పుకో అని అంటాడు.అయితే చివర్లో చిన్న మార్పు చేశాడు ఒక నెటిజన్.

అదేంటంటే ఈ సినిమాలో వైష్ణవి కూతుర్ని ప్రేమించిన అబ్బాయి నిజానికి విరాజ్ కొడుకు కాదు.అతడు ఆనంద్ కొడుకు.

అయితే ఓసారి ఎగ్జిబిషన్లో ఆనంద్ కొడుకు తప్పిపోతే విరాజ్ కు దొరుకుతాడు.దాంతో విరాజ్ ఆ బాబుని దత్తత తీసుకొని కన్న కొడుకు లాగా పెంచుతాడు.

అయితే చివర్లో నిజం మొత్తం చెప్పటమే క్లైమాక్స్.ప్రస్తుతం ఈ స్టోరీ బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube