తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఒకరు.ఈయన చేస్తున్న సినిమాలన్నీ ప్రస్తుతం మంచి విజయాలను సాధిస్తున్నాయి.
ముఖ్యంగా విశ్వం భర సినిమాతో తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని కూడా రిలీజ్ చేశారు.
ఇక దసరా కానుక గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ ను సంపాదించుకోవడమే కాకుండా చిరంజీవి అభిమానుల్లో కూడా ఉన్న సందేహాలను పటాపంచలు చేసిందనే చెప్పాలి.
నిజానికి ఈ సినిమాలో గ్రాఫిక్స్( Graphics) చాలా అద్భుతంగా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.చిరంజీవి ఈ సినిమాతో మరోసారి యాక్షన్ హీరోగా తనను తాను ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ సినిమా భారీ సక్సెస్ సాధిస్తుందనే నమ్మకంతోనే సినిమా యూనిట్ ముందుకు సాగుతుంది.
మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.ఇక ఇదిలా ఉంటే చిరంజీవి మాత్రం ఈ సినిమా కోసం చాలా ఎక్కువగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది.
ఆయన చేసిన మిగతా సినిమాలన్నింటికంటే ఎక్కువగా ఈ సినిమా కోసమే చాలా ఇబ్బంది పడుతూ కూడా ఈ సినిమాని కంప్లీట్ చేస్తున్నారట.ఇక అసలు మ్యాటర్ ఏంటి అంటే ఈ సినిమా షూట్ డిఫరెంట్ లొకేషన్స్ లో ఉండడంవల్ల చిరంజీవికి అక్కడికి వెళ్లడం అవి కొండ ప్రాంతాలు అవ్వడం వల్ల ఆయన చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారట.అయినప్పటికీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ముందుకు సాగుతుండటం విశేషం…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…
.