తెలుగులో మహేష్ బాబుతో రొమాన్స్ చేస్తా అంటున్న బాలీవుడ్ బ్యూటీ

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.సౌత్ ఇండియాలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో టాప్ చైర్ లో ఉన్న వ్యక్తి.

 Parineeti Chopra Interested To Romance With Mahesh Babu, Saina Movie, Bollywood,-TeluguStop.com

మహేష్ బాబు కేవలం తెలుగు సినిమాలే చేసినా కూడా అతని ఇమేజ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది అంటే ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.సౌత్ లో ఉన్న అందమైన హీరోలలో కూడా నెంబర్ వన్ స్థానంలో మహేష్ బాబు ఉంటాడు.

మిగిలిన హీరోలు మ్యాన్లీగా ఉంటే మహేష్ బాబు మాత్రం మ్యాన్లీ లుక్ తో పాటు అందంగా ఉంటాడు.అందుకే అతను అమ్మాయిల కలల రాకుమారుడు అయ్యాడు.

కామన్ టీనేజ్ గర్ల్స్ నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కూడా మహేష్ బాబు లాంటి బాయ్ ఫ్రెండ్ లేదంటే భర్త ఉంటే బాగుంటుంది అని కోరుకుంటారంటే సూపర్ స్టార్ స్టామినా ఏంటో అర్ధమవుతుంది.ప్రస్తుతం మహేష్ బాబు పరశురాం దర్శకత్వంలో సర్కారు వారిపాట సినిమా షూటింగ్ లో ఉన్నాడు.

Telugu Bollywood, Mahesh Babu, Saina, Tollywood-Movie

ఇదిలా ఉంటే బాలీవుడ్ బ్యూటీస్ సైతం సౌత్ హీరోలలో తమ ఫస్ట్ ఛాయస్ అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు అని చెబుతారు.గతంలో దీపికా పదుకునే సౌత్ లో అవకాశం వస్తే మహేష్ బాబుతో సినిమా చేస్తానని చెప్పింది.అయితే ఇప్పుడు ప్రభాస్ తో తెలుగులో తెరంగేట్రం చేస్తుంది.ఇప్పుడు మరో బ్యూటీ పరిణితి చోప్రా కూడా తనకు మహేష్ అంటే చాలా ఇష్టం అని చెబుతుంది.

అతనికి నేను పెద్ద అభిమానిని అని తాజాగా చెప్పుకొచ్చింది.తెలుగులో నటించాల్సి వస్తే అది కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబుతో మాత్రమే అనే తెగేసి చెప్పేసింది.

ఇక ఎవరితో కూడా తెలుగులో చేయనని స్పష్టం చేసింది.సూపర్ స్టార్ మీద ఉన్న అభిమానంతోనే అతనితో రొమాన్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు పరిణితి మాటల బట్టి అర్ధమవుతుంది.

ఇదిలా ఉంటే పరిణితి చోప్రా తాజాగా సైనా నెహ్వాల్ బయోపిక్ లో టైటిల్ రోల్ పోషించింది.ఆ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube